30, మార్చి 2016, బుధవారం

మజ్జిగను ఎలా తాగాలి ?

పూర్వం ప్రతి ఇంట్లో ఆవులు గేదెలు వుండేవి అప్పుడు పెరుగు బాగా వుండి కుడా మజ్జిగ ఎందుకు మాత్రమే వాడారు ? మరి ఇప్పుడు అందరు పెరుగు వాడుతున్నారు . ముఖ్యంగా పెరుగును రాత్రి తిన కూడదు . రాత్రి పెరుగు తింటే వాతం ఎక్కువగా ఉంటుంది . ఈ నాటి గృహిణులు అందరు తెలుసుకోవాలి . ఆయుర్వేదంలో మజ్జిగను పది రకాలుగా చెప్పారు అవి ఇప్పుడు చూద్దా౦.  మదితము అనే మజ్జిగ ; పేరు కొన్న పాలలో నీరు కలపకుండ చిలికి తయారు చేసిన మజ్జిగ . ఇది చిక్కగా జిడ్డుగా వుంటుంది ఈ మజ్జిగ ఆహారంలో వాడుతూ ఉంటె నిరసం ఉదర రోగాలు పైత్యం వల్ల కలిగిన వాతం నాలుకకు రుచి తెలియక పోవడం మూత్రము ఆగి పోవుట . నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి బలము కలుగు తుంది . ఈ రకమైన మజ్జిగ మన రెండు రాష్టాల ప్రజలు గ్రీష్మ ,శరత్ , హేమంత శిశిర రుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు . (2) మిలితమను మజ్జిగ ; పెరుగు ఒక వంతు నీళ్ళు మూడు వంతులు పోసి చిలికి తయరు చేసిన మజ్జిగ . ఇది శరీరంలో ని పైత్యం అరుచి ని అతిసార , విరేచానాన్ని రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను కుడా హరించి వేస్తంది . ( ౩) గోళము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీరు కలిపి తయారు చేసినది . ఈ విధమైన మజ్జిగ ను వాడుతూ వుంటే వీర్య వృద్ది , కలిగి శరీరానికి కాంతి వస్తుంది . కళ్ళకు మేలు చేస్తుంది . ఉదరములో మందగ్ని విష దోషములు , మేహము , ప్రమేహము , కఫ , రోగము ఆమ రోగము , అను వానిని పోగొడుతుంది . ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ , వర్ష , రుతువుల యందు సేవించ దగినది . ( 4) షాడభము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి చేసినది ఇది శ్లేష్మ రోగాలను గుల్మ రోగాలను రక్త మూల వ్యాదిని పోగొడుతుంది తేలికగా ఉండి ఉదరములో జటరాగ్నిని పెంచి శరీరానికి కాంతి వస్తుంది . (5) కాలేశేయము అను మజ్జిగ  ; ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయరు చేసినది ఈ మజ్జిగ బంక విరేచనాలు , విషములను ,  ఉబ్బులను , మంటను , వాతమును ముఉల వ్యాదిని , పోగొట్టి శరీరమును త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది . ఇప్పటికే పడిన ముడతలు కుడా తిసి వేస్తుంది . ( 6) కరమదితము అను మజ్జిగ ; పెరుగు నీళ్ళు సమంగా కలిపి చిలికి తయారు చేసినది . ఈ మజ్జి గ వగరుగా , పుల్లగా , రుచి కరముగా ఉంటుంది . ఈ మజ్జిగలో కొద్దిగా వేడి స్వబావం , మల బద్ధకం చేసే గుణం కుడా ఉంది . అయితే దీని వలన జట రాగ్నిబాగా పెరుగు తుంది . ప్రమేహము , చర్ది , ఉబ్బు , ముఉల రోగం ,భగందరమూ , కామెర్లు , కఫ వాతము , అరుచి , వీటిని పోగొట్టి వీర్య వృద్దిని బలాన్ని అందిస్తుంది . ఈ మజ్జిగ  ముఖ్యంగా వర్ష కాలలో సేవించడానికి అనుకూల మైనది . ( 7 ) ఉదాస్వితము అను మజ్జిగ ; పెరుగులో నాలుగవ వంతు నీళ్ళు పోసి చిలికి చేసినది . ఇది గుల్మములను , దెబ్బలను , అన్ని రకాల వాతములను , దారుణ వీరేచనాలను , తల తిప్పే రోగమును , మొదలైన సమస్త రోగాలను పోగొడుతుంది . దేహ పుష్టిని , ఇస్తుంది . ముఖ్యంగా ఈ మజ్జిగ గ్రీష్మ రుతువులో సేవింప దగినది . ( 8 ) తక్రమ అను మజ్జిగ ; పెరుగులో సగం వంతు నీళ్ళు కలిపి చిలికి తయారు చేసినది . ఇది తేలికగా ఉండి వేడిని అణచి వేస్తుంది . శరీరం తెల్లగా మారే పాండు  రోగము , ఉబ్బు , కఫ , వాతము , కడుపులో బల్లలు ,  భందరము  , ఉదార రోగాలు పోగొడుతుంది . దీనిని వసంత రుతువులో శొంటి , పిప్పలి , మిరియాలు , ఉసిరిక  పప్పు , ఈ నాలుగు ఒకొక్క గ్రాము వంతున కలిపి తాగాలి . ( 9 ) దండ హతము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు పోసి కవ్వముతో చిలికి తయారు చేసినది . ఇది రుచి కరముగా ,ఉంటుది . శరీరంలో అతి వేడి , అధిక కపము , ముత్రంలో పడే సుద్దా మొదలైన మేహములను మూలా వ్యాదిని పోగొడుతుంది . ఆహరం బాగా జీర్ణం చేస్తుంది . ఈ రకమైన మజ్జిగ ఎల్లప్పుడూ  తీసుకోవచ్చు . ( 1౦ )  అతి మీలితము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు తొమ్మిది వంతుల నీళ్ళు పోసి చిలికి చేసిన మజ్జిగ . ఇది ముఖ్యంగా ముఖానికి సంబందిచిన రోగములను గుల్మ్ మును , బల్ల , భాగందరము , ఉదర రోగము , అనే సమస్యలను పోగొడుతుంది . ***** మజ్జిగ గుణ దోష ప్రభావాలు ***** మజ్జిగ త్రి దోష సంహరి అనగా వాత , పిత్త , కపము , అనబడే మూడు దోషాలను సమ స్థితికి తీసుకొచ్చి సర్వ రోగములను పోగొడుతుంది . నాటు ఆవు పాల  నుండి కాని , నాటు గేదెల నుండి కాని పాలు తిసి పేరా పెట్టి చిలికి తయారు చేసిన మజ్జిగ భూలోక అమృతం . *** వాత రోగులు మజ్జిగ ఎలా వాడాలి  ? *** శరీరంలో ఇ ఒక్క భాగం లో నైన గాని , వాతము చేరి నందు వళ్ళ కలిగిన వాత వ్యాదులకు ఒక గ్లాసు పుల్లని మజ్జిగ లో ఒకటి లేదా రెండు గ్రాములు దోరగా వేయించిన శొంటి పొడి అదే మోతాదులో సైందవ లవణం కలిపి రెండు పూటల తాగుతూ ఉంటే వాత  వ్యాదులు అదుపులోకి వస్తాయి . **** పైత్య రోగులు మజ్జిగను ఎలా వాడాలి ? ***** శరీరంలో అరి కాళ్ళ మంటలు , అరి చేతులు మంటలు లేదా కళ్ళ మంటలు , తల , లేదా శరీరం అంత అమిత వేడితో కాలి పోతు ఉండడం చర్మ ము పై ఎర్రని పొక్కులు పుడ్లు రావడం నవ రంద్రాలలో ఎటు నుండి అయిన  రక్తం రావడం మొదలైన అనేక సమస్యలు ఉన్న వారు తియ్యని పలుచని ఒక గ్లాసు మజ్జిగ లో ఒక టే స్పూన్ కండ చక్కర పొడి కలిపి రెండు లేక మూడు పూటల తాగుతూ ఉంటే  పైత్య రోగం అదుపులోకి వస్తుంది . 

4 కామెంట్‌లు:

  1. థాంక్ యు రామాంజనేయులు గారు

    రిప్లయితొలగించండి
  2. SIR, YOUR SUBJECT MATTER IS A VERY GOOD ONE. THANKS - ONE MORE THING - ONCE HAVING
    PLACED, YOUR STIPULATION OF THE CONDITION THAT FOR CUT COPY PASTE YOUR PERMISSION IS
    REQUIRED - PLEASE THINK OVER - IT IS A GENERAL MATTER AND USEFUL FOR ONE AND ALL.
    FURTHER YOU YOURSELF HAVE PROVIDED FACILITIES FOR SHARING THE VARIOUS SOCIAL NET
    WORKS.
    MAY GOD BLESS YOU ALL IN THE FAMILY?

    రిప్లయితొలగించండి