2, మే 2016, సోమవారం

తలనొప్పికి 45 సెకన్లు నొక్కి పడితే ?

తల నొప్పి బాదిస్తొంద ? ఒత్తిడితో సతమత మవుతున్నరా ? ఇలా ప్రపంచంలో చాల మందికి ఇదే సమస్య తో బాద పడుతుంటారు . మెడిసన్ వేసుకున్న లాభం లేదు , కాని కను బొమ్మల మధ్య ఉండే ప్రాంతంలో 45 సెకన్లు నొక్కి పెట్టి చుడండి ఎక్కడ లేని కొత్త శక్తి వచ్చేస్తుంది . 12 మేజర్ మెరిడియన్స్ , మన శరీరంలో ఉంటాయి . అవన్నీ ఇదే ప్రాంతంలో కనెక్ట్ అయి ఉంటాయి . మనం నొక్కి పట్టినప్పుడు ఇవన్ని రిలాక్స్ అవుతాయి . ఇక్కడ మూడో కన్ను కూడా ఉందని అంటారు . ఇది నొక్కడం వల్ల టేక్షన్ తగ్గుతుంది . రక్త సరపరా మెరుగ్గా జరిగి మెదడులోని ఎండ్రో ఫిన్స్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి . అందుకే ఇది ఒత్తిడి తగ్గించే " కీ  " పాయింట్ కేవలం ఒత్తిడే కాదు జ్ఞాపక శక్తి , తల నొప్పి , కంటి నొప్పులు , ఇన్స్ మోయ , సైనస్ సమస్యల నుండి రక్షణ పొంద వచ్చు . ఒకవేళ ఏ సమస్యలు లేకున్నా ఇలా నొక్కడం వల్ల ఆధ్యాత్మికంగా , భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా చేస్తుంది . మరి ఒత్తిడి గా ఉన్నప్పుడు ఇలా నొక్కి పట్టి చూసుకోండి . 
 

కౌగిలింతలో ఎన్ని రకాలు ఉన్నాయి ?

ఋగ్వేదంలో దశయిత రుక్కులని ఉన్నాయి . దశ అంటే పది . అవి ఆలింగనం , చుంబనం , నఖక్షతాలు , సీత్య్రుతాలు , పానిఘతలు , సంవేశనం ,ఉపసృప్తం , దంతక్షతం , ఔపరిష్టికం , పురుషాయితం . వీటిని కూడా చతుషష్టి అంటారు . పాంచాలికి చతుషష్టి లో చుంబనం మొదలైనవి ఉన్నాయి . చుంబనం అంటే ముద్దు పెట్టుకోవడం . అది ఆలింగనం అంటే కౌగిలించుకోవడం . తరువాత జరిగే పని . ఈ ఆలింగనంలో సమగాతాలింగం , అసమత లింగం , అని రెండు విధలున్నాయి . అసమత లింగం అంటే అంతకు ముందు ఎప్పుడు కలుసుకొని నాయిక , నాయుకులు పరస్పరం ప్రేమను తెలియ పర్చుకోవటం కోసం కౌగిలించుకోవటం . దీనిలో స్పరుష్టకము , విద్దకము , ఉద్గారుష్టకము , పీడితము అని నాలుగు రకాలున్నాయి .ఈ శాస్ర్తంలోసంజ్ఞను బట్టే పేర్లను నిర్ణయించారు . అంటే పేరును బట్టే తత్స్౦బందమైన కర్మలను తెలుసుకోవచ్చు . నాయికా ఎదురైనప్పుడు ,ఎదో పని మీద పోతునట్లుగా ఉన్న నాయకుడను శరీరం తగిలితే దానిని స్పష్టకం అంటారు . ఇతరులేవరు లేని ప్రదేశంలో నాయకుడు నుంచుని ఉండగా గాని కూర్చుని ఉండగా గాని ఎదో ఒక వస్తువును తీసుకో బోతున్నట్లుగా సమీపించి నాయిక తన రొమ్ములతో అతన్ని క్రుమ్మటాన్ని వెంటనే నాయకుడు ఆమెను గట్టిగ పట్టుకోవటాన్ని " విద్దకం " అంటారు . పై రెండు ఆలింగానాలు కొద్ది కొద్దిగా మాత్రమె మాటలు కలసిన నాటిక ,నాయకుల మద్య జరిగేవి . 
చీకట్లో గాని జనం ఎక్కువగా కిక్కిరిసి ఉన్న చోట గాని నిర్జన ప్రదేశంలో గాని మెల్ల మెల్లగా పోతు ఒకరి అవయవాలను ఒకరు నాయికా నాయకులు రాచుకోవటాన్ని " ఉద్ఘరుష్టకం " అంటారు . నాయికను ఒక గోడకు గాని స్తంబానికి గాని , గుంజకు గాని ఆనించి నాయకుడు గట్టిగ పట్టుకుంటే దాన్ని " పీడితకం " అంటారు . పై రెండు సూత్రాలలో చెప్పబడ్డ అనేవి పరస్పరం బాగా పరిచయం ఉన్న నాయికా , నాయకులలో మాత్రమె సాధ్యమవుతాయి . పై సూత్రాలలో చెప్పబడ్డ నాలుగు ఆలింగానాలు కేవలం ఒకరి మీద మరోకరికున్న ప్రేమను తెలియ పరచటానికి మాత్రేమే ఉద్దేశింప బడ్డాయి . ఇక రతి సమయంలో జరిగే ఆలింగానాలు వేరే నాలుగు ఉన్నాయి .అవి  " లతా వేష్టితకం " , వ్రుక్షదిరూడకం " , తిల తండులకం " , మరియు క్షిరనీకం . వీటిలో మొదటి రెండింటిలోను నాయికయో ప్రయోక్తిగా ఉంటుంది . మిగిలిన రెండు నాయిక , నాయకులూ కల్సి ప్రయోగించవచ్చు . లతా అంటే " తీగ " ఆవేష్టనం అంటే చుట్టుకోవటం . లతా వేష్టితకం అనే ఆలింగనంలో నాయికా ,నాయకునిని తీగల చుట్టుకొంటుంది . కాబట్టి దీనికా పేరు వచ్చింది . నాయకుని ముద్దు పెట్టుకోవటం కోసం , క్రిందకి వంచి ఉన్న తన ముఖాన్ని పైకెత్తి , సన్నని మంజులమైన ఒక ధ్వనితో నాయిక , నాయకుని ముఖాన్ని సమీపించి సమ్మోహనంగా చూడటాన్ని లతా వేష్టితకం  అంటారు . తన యొక్క కాలితో నాయకుని కాలుని ఆక్రమించి రెండవ కాలి తోడాతో అతని పిరుదుల భాగాన్ని ఆక్రమించుకొని చుట్టుకొంటు , అతని వీపు భాగానికి ఒక భుజాన్ని తగిలించి రెండవ భుజంతో నాయకుని భుజాన్ని తలను వంచి సన్నని మంజులమైన ఒక ధ్వనితో ముద్దిడ బోవటం " వ్రుక్షది రూడకం " అంటారు . పై రెండు సూత్రాలలో చెప్పిన ఆలింగానాలు నాయికలు చేయవలసినవి . ఈ ఆలింగానాల వాళ్ళ అనురాగం జనిస్తుంది . 
నాయికా , నాయకులూ పక్క మీద పడుకొని ఒకరి తొడలు మరొకరు , ఒకరి భుజాలు మరొకరు స్పర్శిస్తూ గట్టిగ పట్టుకొంటు కౌగిలించు కోవటాన్ని  " తిల తండులం " అంటారు . నాయిక , నాయకులూ ఏమి చూసుకోకుండా ఎముకలు విరగటం వంటివి జరుగుతయోమోనని లక్ష్యం కూడా చేయకుండా ఒకరిలో ఒకరు లీనమై పోయోతట్టుగా ,నాయికా తొడపై  ఉన్నప్పుడు గాని , ఎదురుగ కూర్చున్నప్పుడు గాని , పక్క మీద గాని గట్టిగ కౌగిలించుకొని . పాలు ,నీరుల , ఆనందం పొందునట్లుగా చేసుకొనే ఆలింగనాన్ని  ' క్షీర జలకాలింగన౦ " అంటారు . పైన చెపిన ఆలింగానాలు  నాయికా ,నాయకులూ రతి సమయంలో మాత్రేమే చేసుకోవల్సినవి . 

సూ || ఇత్యుప  గూహన యోగ బాభ్రవీయ 

ఈ విధంగా బాభ్రవీయ మతము అనుసరించి వారు చెప్పిన ఆలింగనాలు వివరింప బడ్డాయి . ఇక మీదట సువర్ణ నాభుడనే ఆచార్యుని మతము ననుసరించే వారు చెప్పిన ఆలింగానాలు వివరింప బడతాయి . 
సువర్ణ నాభుడు చెప్పిన ఆలింగనాలు ఒక లింగంతో మాత్రమె చేసేవి అవి  " ఉరూప గూహనం  " , జఘనోప గూహనం " , " స్తనాలింగానం " ,లాలాటికాలింగనం " నాలుగు విధాలు వీటిని ఎకాంగోపగూహన చతుష్టయం  అంటారు . నాయకుడు నాయిక యొక్క ఒక తొడను గాని లేక రెండు తొడలును గాని లేక నాయికయో నాయకుని యొక్క ఒక తొడను గాని ,రెండు తొడలను గాని ఉపిరి బిగపట్టి శక్తి కొద్ది నొక్కితే అది " ఉరుపగుహనం  " అనబడుతుంది . ఇది కండ పుష్టి  గల నాయికా , నాయకులూ మాత్రమె చేసుకోదగినది . నాయికా , నాయకులూ తమ తమ పిరుదులతో ఒకరి నొకరు నొక్కుకుంటూ ఉన్నప్పుడు , నాయికా జారిన కొప్పుతో , వేళ్ళతో , గిల్లించు కోవటం కోసం , పళ్ళతో కోరికించు కోవటం కోసం ప్రణయ తాడనం కోసం నాయకుని పై ఎగ బ్రకటాన్ని " జఘనొప గూహనం  " అంటారు . నాయకుడు కూర్చుని ఉన్నప్పుడు గాని , ఒత్తిగిలి పడుకున్నప్పుడు గాని నాయికా తన వీపును వంచి స్తనాల చేత  ఆ పురుషుని ఛాతికి తగిలించి అతను తన భారాన్ని మోసేట్టు చేయటం " స్తనలింగ మన బడుతుంది > అప్పుడా నాయకుడు స్పర్శ సుఖానంతటిని ముద్దుగా చేసి తన హృదయం పై పెట్టినట్లుగా ఆనంద పడతాడు . నాయికా ,నాయకులూ ఒకరి నొకరు ఎదురుగ పడుకున్నప్పుడు ముఖంలో , ముఖం పెట్టి , కన్నుల పైన కన్నులు ఆనించి రెండు , మూడు సార్లు డీ కొట్టి నట్లు తాకితే అది  " లలాట కాలింగనం " అవుతుంది . ఆలింగానలలాగే సంవాహనం అంటే పిసకటం కూడా స్పర్శ సుఖన్నిచ్చేదే కాబట్టి అది కూడా ఒక విధమైన ఆలింగనం లాంటిదే అని కొందరి అభిప్రాయం . 
ఆలింగ నానికి  సంవాహ నానికి స్పర్శ విషయంలో ఎక్కువ తేడా లేక పోయిన భిన్న మైన ప్రయోజనం కలిగినదై , అసాధారణ మైనదవటం చేత సంవాహనం , ఆలింగానాల కోవలోకి చేరినది కాదని వాత్సయనుని అభిప్రాయం . రక రకాల ఆలింగానాల తెల్సుకో గోరినవారికి వాటి గురించి వివరిస్తుండగా , దానిని విన్న ఇతరులకు కూడా వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది . 
ఇలా అడిగిన వాళ్లకు , వివరించిన వాళ్లకు , వివరిస్తుండగా వినిన వాళ్లకు కూడా రతి చేయాలన్న కోరిక కలుగుతుంది . మరి అలాంటప్పుడు స్వయంగా వాటిని ఆచరించే వాళ్ళుకు కోరిక కలగటంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు . 
శాస్త్రంలో వివరించ బడ్డవి శాస్త్రి త మైన ఆలింగ నాలు . ఎవరికీ వారుఉహించుకొని  చేసుకునేవి కొన్ని ఉంటాయి . అవి అశాస్త్రీ తాలు అయినప్పటికీ అనురాగాన్ని పెంపొందించేవే కాబట్టి వాటిని త్రోసి పుచ్చకుండా ఆచరించ వచ్చు . మనుషులు రతలలోను , ఆలింగ నాలలోను ఎక్కువ అవగాహనా లేకుండా ఉన్నప్పుడు అలావారిని  ప్రోత్సహించెంత  వరకే శాస్త్రాలు . గాని రతి చక్రం గిర్రున తిరుగుతున్నప్పుడు ఇది శాస్త్రితమా , ఆశస్త్రితమ దీన్ని ప్రయోగించ వచ్చా ప్రయోగించ కూడద అన్న ఆలోచన గాని ఇది క్రమమ కాదా అన్న శంక ఉండనే ఉండ కూడదు . 
ఇది వాత్సాయనుడు రచించిన కామ సూత్రాలలోని సాంప్రయోగికం అనే రెండవ అధికరణంలో ఆలింగాన విచారం అనే రెండో అధ్యాయం .

1, మే 2016, ఆదివారం

How to Satisfy Women | Dr Samaram Sex Science | CVR Health

Photoshop Tutorial in Telugu Part 2

Photoshop tutorial in Telugu Part -1

కొత్త నెంబర్ డయల్ చేస్తూనే రియల్ టైం వారి పేరు తెలుసుకొవాల

మీ టేబుల్ ఫ్యాన్ ను AC గా మార్చుకోండి

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఇంటి ముందు కళ్ళాపి ఎందుకు చల్లాలి ?

పూర్వం మన దేశంలో గురుకులాల్లోని విద్యార్దులు భిక్షమెత్తి గురువుకి సమర్పిస్తూ విద్యాభ్యాసం చేసేవారు . గ్రామా పురోహితుడు , బౌద్ద బిక్షువులు కూడా " భవతి భిక్షం దేహి " అని గృహస్తులను అర్దించేవారు . " అతిధి దేవో భవ " అన్న సంస్కృతి మనది . బియ్యం , జొన్నలు , రాగులు , మొదలైన ఆహార, ధాన్యంతో పాటుగా కూరగాయలు కూడా ధర్మచారంగా దానం చేసేవారు . గృహస్తులు ఆవుపేడతో కళ్ళాపి చల్లి రంగ వల్లులు దిద్దిన యింటిముందు మాత్రమే ధర్మ భిక్షను అర్దించేవారు . ఏ ఇంటి ముందైన కళ్ళాపి లేకుంటే ఆ ఇంటిలో ఎదో " అశుభం " జరిగి ఉంటుందని అవగాహన చేసుకొని ముందుకి సాగిపోయో పద్ధతి ఉంది . కాల క్రమేనా ఇదొక ఆచారమయింది . ఆవు పేడను నీటిలో కలిపి కళ్ళాపి చల్లడం వల్ల రోగ  కారక క్రిమి ఇంటి లోనికి ప్రవేశించకుండా వుంటుంది . సూర్యోదయానికి ముందే కళ్ళాపి చల్లాలి . ఆ ఆచారము లక్ష్మి దేవికి ఆహ్వానము , సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కళ్ళాపి చల్ల కూడదు . 

26, ఏప్రిల్ 2016, మంగళవారం

నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా లేక ఎర్రగా ఎలా మార్చుకోగలం

అమ్మాయిలు , అబ్బాయిలు మీ ముఖం నల్లగా మారి పోతుందని మీకు బెంగగా ఉందా ? ప్రతి చిన్న సమస్యకు ఆందోళన పడకూడదు . ఇలా మనసులో మలినం లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ క్రింది వాటిల్లో ఎదో ఒకదానిని ఆచరించండి . 

బాదం పప్పుతో  బంగారు యోగం  

ఉదయం పూట నాలుగు బాదం పప్పులను అరా గ్లాసు మంచి నీటిలో వేసి నానా బెట్టండి .సాయంత్రం ఆ పప్పులపైన  ఉన్న తోలు తీసివేసి లోపలి పప్పును మెత్తగా నలగొట్టి అందులో తగినన్ని దేశవాళి గేద పాలు కలిపి మెత్తగా నూరితే గిజ్జు లాగ అవుతుంది . ఈ గుజ్జును రాత్రి నిద్రించే ముందు ముఖానికి లేపనం  చేసుకొని ఉదయం గోరు వెచ్చని నీటితో కడగండి . ఇలా పది , పదిహేను రోజులు చేసేటప్పటికి మీ ముఖంలో మార్పు కనిపిస్తుంది . 

శనగ పిండితో 

రెండు చెంచాల శనగ పిండి తీసుకొని అందులో తగినన్ని దేశవాళి గేద పాలు కలిపి మెత్తగా నూరి నల్ల బడ్డ ముఖానికి పట్టించాలి . అరగంట పాటు పౌర్ణమి నాటి చంద్రుడిని తలుచుకొని అతని తెల్లని కాంతి మన ముఖంలో కి వస్తున్నట్టు బలంగా భావన పెట్టుకోవాలి . తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి . ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటే అతి త్వరలో నలుపు హరించి ముఖ కాంతి పెరుగుతుంది . 

పాలతో .......

దేశవాళి గేద పాలు తీసుకొచ్చి , కాచి దించి అందులో కొద్దిగా ఉప్పు గాని , నాలుగైదు చుక్కల నిమ్మరసం గాని వేస్తె పాలు విరిగి పోతాయి . అలా విరిచిన పాలను వడపోసి నీరు తీసి చిన్న చిన్న తునకలుగా పగిలిన పాల ముక్కలలో సమంగా కస్తూరి పసుపు , బార్లి గింజల పిండి కలిపి మెత్తగా నూరి మఖనికి మెడకు ,గొంతుకు ఇంకా శరీరంపై నల్లని మచ్చలు వచ్చిన చోట అరంగుళం మందంగా లేపనం చేయాలి . అరగంటాగి గోరు వెచ్చని నీటితో కడగాలి . ఇలా ప్రతి రోజు చేస్తుంటే చెడు పదార్దాలు లతో గట్టి పడ్డ చర్మం మెత్తబడి క్రమంగా నలుపు చెరిగి పోయి మంచి కాంతి వస్తుంది .

24, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ వీర బ్రహ్మం గారి త్రికాల జ్ఞానము { సాంద్ర సింధు వేదము }

 వసుధలో { భూమిలో } పంటలు ఎండును . కందినూరులో స్ర్తీ పురుశుడగును . ఉత్తరాదినుండి ప్రజలు వలస వత్తురు . యుద్దములు ఎక్కువగా జరుగును . ఉత్తర దేశమున ప్రజలు కత్తులతో పోరాడేదరు . నది నదములు ఉప్పొంగి ఊల్లన్ని కొట్టుకుపోవును . హంపిలో ఉన్న హనుమంత రాయుడు వీధుల వెంట కేకలు వేయును . అ కేకలకు మహా నంది మూలన ప్రజలు  ఆకులు రాలినట్లు రాలుదురు . మాల మాదిగలు భూపాలగుదురు. మేలు కీడగును . తార తమ్యము లేక ప్రజలు తిరిగుదురు . పదహారు చేతులు గల కామిని గండి కోట  మీద తిరుగును . ఆకాశమున భుగు పుట్టును . ఆవులు ఆకాశము వంక చూసి అరచును . కొత్త పేట సంత పురమునకు మాటలాడే కోతి వచ్చును . ఆ కోతి యత్తేపు రామన్న గట్టు మీద ఏడు దినములుండును . పల్లెలు పట్నాలు గృహ పీడా వలన పాడగును  . కామ క్రోధములు ఎక్కువగును . ధనము కొరకు కలహములు ఎక్కువగా జరుగును . నల్లని ఆవులు ఎక్కువ పాలిచ్చును . బిడ్డలు లేని గోడ్రండ్రా కడుపున బిడ్డలు పుట్టును . జనులకు కష్టములు కలుగ బోవు ముందు వడి గళ్ళ వాన కురియును . పగలు వేళా నక్కలు గ్రామములో అరచును . కుక్క  మూతికి తోక పుట్టును . మద్య పానము వలన జనులు కొట్టుకోనిదేరు . ప్రతి వారు విద్య యందు అపేక్ష కలిగి యుందురు . పాతాళ గంగ యింకును . మంటలు ఎక్కువగా మండును . పాతకులు నశింతురు. నీతి మంతులు నిలిచు యుందురు . వారిదు లింకును వసుధ పాడగును . నక్షత్రములు భూమిమీద రాలును . భరతుని శాపముచేతను శూద్రుల భాగ్య దేవత తొలగి పోవును . కొండవీడు కొల్లబవును . మధుర మీనాక్షమ్మ మాటలాడును . అనేక అద్భుతాలు పుట్టును . నెల్లూరు సీమంతయు నిర్మలమగును . నిడిగల్లు నిర్డుత మగును .ముండ మోపులంత కన్నేలగుదురు . మదముతో భూమినేలేదరు. ఎండా వెన్నెల రెండు సమముగా యుండును . యాగములు ఎక్కువగా చేయుదురు . నాగయ్య అనే 7 సం || ల బాలుడు నాలుగు వేదములు చదువును . బనగానే పల్లె గొప్ప పట్నామగును . భాగ్యముతో తుల తూగుచుండును . రూకకు పుట్టెడు ధాన్యము తరువాత పోకకు పుట్టెడు అమ్ముదురు .లోకములో అన్నము కలిగి ప్రజలు సుఖి౦చెదరు. రామేశ్వరము యెద్ద రణరంగమగును. రాజులు నశించెదరు. కామాక్షి తల్లి కరుణించి భక్తులగాచును . రాయ దుర్గామునకు రామ చిలుక వచ్చి రామధర్మ రాజు వార్తలు చెప్పును . పాయ కట్టు పశువుల యెద్ద  ఏడేండ్ల  పడతికి పిల్లలు పుట్టేదురు . మహా నంది సమీపమున మాల బోయలు ముష్టి యుద్దమున జచ్చేదరు . గోలు కొండలో కొంగ మాటలాడును . ముండ్ల పాటి యెద్ద మునులందరు చేరుదురు . గుండ్లన్నియు తేలును . బెండ్లన్నియు మునుగును . భూ భారము తగ్గును . గంగ , యమునలు ఉప్పొంగును . తుంగ భద్ర తీరమున ముగ్గురు మూర్తులు శృంగారముగా యోలదరు . మేలయిన కృతయుగము ధర్మమము నడుచును . ప్రపంచమంతయు మహా ప్రలయంబులతో నుండు కాలము లగ్నంబులను  బెట్టుకొని ప్రపంచముపైకి పరిగిడుచు వచ్చు చున్నది . కాలమాన పరిస్థితులు క్షణ క్షణంబు నకు మారు చుండును .  { TO BE KUN ....} 

23, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ వీర బ్రహ్మం గారి త్రికాల జ్ఞానము{ సాంద్ర సింధు వేదము }

శ్లో || ప్రభవ  పార్దివ మధ్యేషు 

బహు ప్రళయ నిశ్చయం 
అనంతరే , అనంత నిధ్యే 
రక్త పాతౌ రణరంగ భూమే 
భిభత్సా ప్రపంచ స్థితి ; 
ప్రభవ నామ సం|| నుండి పార్దివ నామ సం|| ర మధ్య కాలమున అనేక ప్రలయములు సంబవించుట జరుగును . అనంతరమున భుమండలమంతయు ఒక రణరంగాముగా మారి ఉహించని రక్త పాతంతో ప్రపంచము భయంకరముగా భీభత్స స్థితిలో కనిపించును . 
కలియుగము 5000 సం || ల పిమ్మట . జరిగే కాల జ్ఞాన విశేషములు 
భరత ఖండoభును పరదేశ వాసులు పాలన చేయుటకు వచ్చెను . వర్ణ సంకరంబు అధికమయ్యెను . అగ్ర వర్ణాలన్నీ కలుషితంబయ్యోను . గుళ్ళలో దేవతల మహిమలే నశియి౦చెనయ. మంత్రం తంత్రములలో శక్తి సన్నగిల్లెను విప్ర జాతుల వారికీ సైతము మద్య మాంసములపై  కోరికలు అధికం అయ్యోను . కనక గర్భం బైన భరత భూమిని పర దేశ వాసులు కొల్లగోట్టేదరు.ఉత్తర దేశమున వైశ్య కులమునందు గందోకడు జనియించెను .వాడు ఎకునే చేబట్టి ఎల్లా జనుల నేకంబుచేసి స్వరాజ్యం తెచ్చెను .రెండుక్షరాల పేరైన వాడు దేశాన్ని 1 8 సం|| లు పాలన చేసెను . ముడుపులు వెంకటేశ్వర స్వామికి ఇష్టమని ప్రజలు ఆ ముడుపులు తిరుపతికి జేర్చేదరు. కడప వద్దనున్న కమల పురంలో కప్పు కోడి వలే కూయును . జాతి జాతికి మధ్య వైరములు కలుగును . జనులు తల్లడిల్లెదరు . పెన్నా యోడ్డునున్న చెన్నూరు గ్రామము వరద పాలగును . ఈశాన్యమునుండి విష గాలి వచ్చి విపరీతముగా నరులు జత్తురు . కపట కిరాతకులను ఖండించుటకు కలికవతారుడు అవతరించును . ఉల్లిగడ్డకు ఉపదేశామిచ్చు కల్ల గురువులు కలికాలమందు వత్తురు . అట్టి గురువునేల్ల యముడు కాల దన్నును . కల్లలేనివారిని గాచును . కోయ రాజ్యం అంత గొడవల పాలగును . సైదా పేటలో సాహెబులందరూ సమరమున సచ్చేదరు . అద్దంకి సీమలో యాదవుని  ఇంట బుద్దునంతటి వాడు పుట్టును .తల్లి పిల్లలు తగువులాడు దినములు  వచ్చును . గద్దలను కాకి తన్నును . బ్రాహ్మణులకు పీటలు మాలలకు మంచాలు వేయుదురు . మధుర తంజావూరులు హరించును . మహానంది శిఖరము విరుగును . హంపి వీరుపాక్ష రెండు కన్నుల నడుమ అగ్ని వర్షం కురుయును . భూమి వణికి గ్రామంబులందును ముండ మోపులంత ముతైదులు అయ్యోరు . ముందు  ఏమి జరుగునో తెలియదందురు. చెడు నడలతేచే ప్రవర్తించు జనులు పండుటాకులు రాలినట్లు రాలుదురు . కుంభ కోణంలో గో వధ  ఎక్కువగా జరుగును . కొల్ల పురము కొల్లగోట్టేదరు .కంభం చెరువులో పొన్న పూయును ఆదోనీలో కప్ప కోడి కూచినట్టు అందరు వినుచుండగా కూయును . వావి వరసలు లేక జనులు చరించేదరు . { to be kun .....} 

20, ఏప్రిల్ 2016, బుధవారం

పసి పిల్లల వ్యాదుల్ని ఎలా తెలుసుకోవాలి

మాటలు రాని వయసులో ఉన్న పసి పిల్లలు తమ శరీరంలో ఏ భాగాన్ని తమ చేతితో అనేక సార్లు తాకుతూ ఉంటారో ఏ భాగం పైన పెద్దల చేయి తగిలితే సహించలేక ఏడుస్తూ ఉంటారో ఆ భాగంలో నొప్పి ఉన్నాదని పెద్దలు తెలుసుకోవాలి . 
పసి బిడ్డలా - ఛాతి నొప్పి లక్షణాలు ;- 
పిల్లలు ఎక్కువ సమయం కళ్ళు మూసుకొని ఉంటె ఆ పిల్లలకు శిరస్సులో నోప్పి  ఉన్నాదని గుర్తు . అలాగే పిల్లలు నాలుకను పెదవులను మాటిమాటికి నొక్కుతూ చేతులను ముడుచుకుంటే వారికీ రొమ్ములో అనగా చాతిలో నొప్పి ఉన్నాదని తెలుసుకోవాలి . 
పసి బిడ్డలా - కడుపునొప్పి లక్షణాలు ;- 
సుఖ  విరోచనం కాకుండా మల బంధం జరిగిన లేక వాంతి చేసుకుంటున్న లేక పాలు తాగేటప్పుడు తల్లి స్తనాలను కొరుకుతున్న లేక బిడ్డల ప్రేవులు అరుస్తూ ఉన్న ఈ లక్షణాలు శిశువులుకు కడుపులో నొప్పి ఉన్నాదని అర్ధం చేసుకోవాలి . 
పసిబిడ్డల ఆసనం - నొప్పి లక్షణాలు ;- 
మూత్రం సరిగా విడుదల కాక పోయిన లేక అకారణంగా ఉలికిపడుతూ ఉన్న అటు ఇటు దిక్కులు దిక్కులు చూస్తూ ఉన్న బిడ్డలకు గుదము నందు అనగా ఆసనం లో నొప్పి ఉన్నదని తెలుసుకొని తగిన చికిత్సలు చేయాలి . 
పిల్లలకు - పండ్లు వచ్చేటప్పుడు కలిగే వ్యాధులు ;- 
పసి బిడ్డలకు దంతాలు మొలిచే సమయం సర్వ రోగాలకు కారణమని ఆయుర్వేద శాస్త్ర వేత్తలు తెలియ చేసారు . ఆసమయంలో బిడ్డలకు జ్వరము మల బంధము , దగ్గు , వాంతి , తల నొప్పి , అనే వ్యాదులు ఎక్కువగా పుడుతుంటాయి . 
పిల్లల - పొత్తి కడుపు లక్షణాలు ;- 
బిడ్డలకు కడుపు ఉబ్బురంగా ఉండి మాటిమాటికి కడుపును పైకెత్తుతూ ఉంటె వారికీ పొత్తి కడుపులో నొప్పి ఉన్నదని గుర్తు పట్టాలి . 
అక్షిత 

16, ఏప్రిల్ 2016, శనివారం

అభిషేకం చేస్తుండగా కళ్ళు తెరచిన శివుడు { విడియో }


దేవా రహస్యం ; శ్రీ రాముని జన్మ రహస్యం { 2 }

hm t. v. 2014   ఏప్రిల్ 
ఒక చతుర్యుగం అంటే 4 ౩  లక్షల 2 ౦ వేల సంవత్సరాలలో పూర్తీ అవుతుంది .ఇందులో 4 లక్షల ౩ 2 వేల సం || లు కలియుగం .దీనికి రెట్టింపు అంటే 8 లక్షల 6 4 వేల సం || లు ద్వాపర యుగం . కలియుగానికి మూడు రెట్లు అంటే 1 2 లక్షల  9 6 వేల సం || లు త్రేతా యుగం . కలియుగానికి నాలుగు రెట్లు అంటే 1 7 లక్షల 2 8 వేల సం|| లు కృత యుగం . ఈ లెక్కల ప్రకారం త్రేతా యుగం ఇవాల్టికి 8 లక్షల 6 6 వేల సం || లు క్రితం ముగిసిందన్న మాట . ఆ ప్రకారం రామాయణం 8. 1/2 లక్షల  సం || ల క్రితమే జరిగింది . యుగ విభజన ప్రకారం లెక్క రాముడు 8 .1/ 2 లక్షల క్రితం ఈ దేశాన్ని పరిపాలించాడని ఈ యుగ విభజన చెబుతుంది . ఇన్ని సం || ల క్రితం నాటి చరిత్రకు ఆనవాళ్ళు దొరకడం సాద్య్హమేనా ? ఈ యుగ విభజన ప్రకారం ఖగోళ గమనాన్ని గణిస్తే " పునర్వసు  నక్షత్రంలో  ఉత్తరాయణ పుణ్య కాలంలో చైత్ర శుద్ధ నవమి రోజున రామ చంద్రుడు  జన్మించాడు " అంటే 8 లక్షల ౩ వేల 2 ౩ వ సం || లో  రామ చంద్రుడి జననం జరిగింది . రావణ వధ తరువాత ఆయన 1 ౩ వేల సం || ల పాటు భారత దేశాన్ని పరిపాలించాడని వాల్మికి రామాయణం చెబుతుంది . దీనికి పూర్తీ స్తాయి హేతు బద్దత ఏంటి అంటే హిందూ యుగ ధర్మమే . చతుర్యుగ కాల మానమే ఇందుకు ఏకైక కొలమానం . దీనికి స్పష్టమైన ఆధారాలు చూపించటం కష్టమే . ఈ లెక్కల ప్రకారం 2 8 వ  మహా యుగంలో రామాయణం జరిగింది . కాని ఇప్పుడు ఖగోళ శాస్త్ర వేత్తలు మాత్రం అదేం వాల్మికి రామాయణాన్ని ఆధారం చేసుకొని రాముడి కాలాన్ని ఖచ్చితంగా నిర్దా రిస్తున్నారు . వారి గంణకాల ప్రకారం రామాయణ కాలం కేవలం 1 ౦ వేల సం || క్రితం జరిగిందని అంటున్నారు . లెక్కలతో సహా నీరుపిస్తున్నారు . తేదీలతో సహా చెబుతున్నారు ఈ గణంకాల లెక్కల్లోనే రాముడు ఈ భూమి  మీద జీవించి ఉన్నాడని వారు అంటున్నారు . వాల్మీకి రామాయణంలో  2 4 వేల శ్లోకాలను అక్షరం అక్షరం మధించి నిజాన్ని నిగ్గు తేల్చారు . ఖగోళ శాస్ర్త వేత్తల లెక్కల ప్రకారం రామాయణం 1 ౦ వేల సం || ల పూర్వం జరిగినవాస్తవం . ఇందుకు సంబందించిన ఆధారాలను కార్బన్ డేటింగ్ తో సహా శాస్ర్త వేత్తలు నిరూపిస్తున్నారు .
భారత దేశంలో రామాయణానికి సంబందించిన రుజువులన్ని దొరికాయి . ఉత్తర ప్రదేశ్ లోని పైజ బాద్ జిల్లాలోని అయోధ్య లో రాముడి జన్మ స్తలం మొట్టమొదట కనుగోన్నది విక్రమదిత్యడు .ఆయనే అయోధ్యలో గొప్ప ఆలయాన్ని నిర్మించాడు . రామాయణంలో పేర్కొన్న సరయు నది సాకేత పురి అన్ని ధృవీకరణ జరిగాయి .  అయోధ్య సరయు నది తీరంలోనే ఉంది . అటు లంకలో రావణుడి ఆన వాళ్ళు స్పష్టంగా లభించాయి . అన్నింటికీ మించి రాముడు లంకకు కట్టిన సేతువు ఇవాల్టికి ౩ ౦ కి. లో . మీ . మేర మనకు కనిపిస్తూనే ఉంది . ఇది పూర్తిగా మానవ నిర్మితామేనని నాసా కూడా స్పష్టం చేసింది 
వీటిని బేస్ చేసుకునే రామాయణ కాల నిర్ణయం పై పరిశోధన సాగింది . వాల్మికి రామాయణంలో రాముడు జన్మించిన సమయాన్ని ఆదికవి వర్ణించిన పద్యాలలో ఆయన జన్మ కాలాన్ని నిర్దారించారు  . సరోజ్ వాళ , డాక్టర్  పి.వి . వర్తక్ . డాక్టర్ సౌరభ్ పాత్ర . లాంటి ప్రముఖ హిస్తారియన్లు రాముడి పుట్టిన తేదిని నిర్దారించారు  . ఆస్ట్రో మాథ్స్ ప్రకారం రామాయణం 9 వేల ౩ వందల బి ,సి , సం || ల క్రితం జరిగింది . వాల్మికి రామాయణంలో ని బాల కాండ లోని 1 9 సర్గ లోని 8 ,9 , శ్లోకాలు రామ జననం గురించి వివరిస్తున్నాయి . ఉత్తరాయణం చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం . అ సమయంలో సూర్యుడు మేష రాశిలో 1 ౦ డిగ్రీల కోణంలో ఉన్నాడు , అంగారకుడు మకరంలో 2 8 డిగ్రి లలో ,గురువు కర్క్టక టక లో 5 డిగ్రీలలో , శుక్రుడు మీనా రాశిలో 27 డి|| , శని తుల రాశిలో 2 ౦ డిగ్రీల కోణంలో ఉన్నారు . మహా భారత యుద్ధం నాటి గ్రహ రాశుల ఉన్న పొజిషన్ బట్టి b,c ౩ వేల 1 వంద 2 లో జరిగినట్టు నిర్దరణ అయ్యింది . మొహంజదారో లో లభించిన రెడియోషన్ ఎపెక్ట్ కూడా దీని ఖచ్చితత్వాన్నే నిరూపిస్తున్నది . ఈ లెక్కలను ఆధారం చేసుకొని ప్లానిటరి పొజిషన్ ను ఆస్ట్రో శాస్త్ర వేత్తలు లెక్కిస్తూ వెళ్లారు . దీని ప్రకారం , సూర్యుడు , అంగారకుడు , గురువు , శుక్రుడు , శని రాహువు , బాల కాండలో పేర్కొన్న పొజిషన్ లో ఉన్నారు { to be kun ........}  

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

దేవా రహస్యం ; శ్రీ రాముని జన్మ రహస్యం { 1 }

hm t.v  2014  ఏప్రిల్ 
వాస్తవంగా జరిగిందేనా లేక మిధ్య వాదామ . రాముడు నిజంగా ఈ భూమి మీద ఉంటె రావణ సంహారం చేసి ఉంటె ఆయనది చరిత్రే అయితే ఆయన ఎప్పుడు పుట్టాడు ? కాల  నిర్ణయం చేయడం సాధ్యమేనా .? శ్రీ రామ చంద్రుని  కాల కధ కధన రహస్యం ఏంటి ?


రామ రాజ్యం ఇవాళ ప్రపంచం అంత కోరుకునే ఆదర్శ వంతమైన పరి పాలన భారత దేశం మరే ఇతిహాసాలలో ఒకటిగా భావించే రామాయణంలో శ్రీరామ చంద్రుడు సాగించిన పరి పాలన ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఈ దేశానికి మార్గ దర్శన మైంది . ఐతే రామాయణం ఇతిహాసమ ? లేక చరిత్ర ? శాస్ర్తియంగా లేని నిరూపణలు రామాయణాన్ని ఒక కధగా కొట్టి పారేస్తుంటే శాస్ర్తియతో సంబంధం లేని విశ్వసం రాముడి అస్తిత్వన్ని వాస్తవంగా గు ర్తిస్తోంది .ఇప్పుడు ఆస్ట్రో మ్యాటిక్ పరి శోధనలు సహేతుకంగా రుజువు చేస్తున్నాయి . మొన్న లంకలో రాముడి ఆనవాళ్ళు రామాయణాన్ని నిరూపించాయి . కిష్కింద సామ్రాజ్యం వానర రాజ్యానికి నిలువు దర్పంగా నిలిచింది . గోదావరి తన తీరాన రాముడి ఉనికిని చాటుతుంది . ఇప్పుడు ఖగోళ శాస్త్ర పరిశోధనలు మరింత రామాయణాన్ని చరిత్రగా ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నాయి . రాముడు పుట్టాడు తేది తో సహా తేలి పోయింది . అనంత విశ్వంలో గ్రహాల కదలికలు మార్పులు రామాయణ కాలాన్ని నీరుపిస్తున్నాయి . బ్రిటిష్ వాళ్ళు మనకు చరిత్రే లేదన్నారు . కానీ ఔత్సాహిక పాశ్చాత్య చరిత్ర కారులు మన  హిస్టారియన్ల తో కలసి మన జాతి మూలల్లో అద్భుతాలు ఆవిష్కరిస్తున్న కొద్ది భారతీయుల చరిత్ర వందల వేలు లక్షల సంవత్సరాలుకు  పై బడి లోతుల్లోకి అంతు తెలియకుండా చొచ్చుక పోతున్నాయి . వాల్మీకి రచనలో కాల నిర్ణయం అంత ఖగోళ సంబంద ఉంది . రోదసిలో గ్రహాల ఆధారంగా రాముడు పుట్టింది ఖచ్చితంగా అని వీలు అవుతుంది దాని ఆధారంగా రాముడు పుట్టింది తేదీల వివరాలు తెలుసుకునేందుకు సాధ్యం అయింది . రాముడు కేవలం పౌరాణిక పాత్ర కాదు చరిత్ర . ఈ భూమిని పరి పాలించిన గొప్ప పాలకుడు ఆయన పుట్టింది నిజం . పెరిగింది నిజం . రావణ సంహారం చేసింది నిజం . రామాయణం పుక్కిటి పురాణం కాదు . రాముడు దేవుడా రామాయణం ఎప్పుడు జరిగింది ? ఇవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు . మన తరానికి అంతు పట్టని తెలియని ప్రశ్నలు . అసలు రామాయణమే లేదని ఇది కేవలం ఒక మిధ్య వాధమని కల్పిత కావ్యమని తప్ప చరిత్ర కాదని చెప్పేవాళ్ళు చాల మందే ఉంటారు ? కాని రామాయణ కాలం ఇప్పటికే విస్పస్టమైంది . టైం తో సహా తేలింది హిందూ కాల మాన ప్రకారం చతుర్యుగా విభజన మేరకు రామాయణం ఉనికి త్రేతా యుగంలో కనిపిస్తుంది . ఒక మహా యుగం అంటే కృత , త్రేతా , ద్వాపర , కలియుగాలన్నమాట . ఒక చతుర్యుగం మొత్తం 4౩ లక్షల 20 వేల సంవత్సరాలలో పూర్తీ అవుతుంది . { to be kun........... } 
నా అనుమతి లేనిదే ఈ పోస్ట్ ని ఎవరు కాఫీ & పేస్ట్ చేయరాదు 


                

11, ఏప్రిల్ 2016, సోమవారం

కోడి గుడ్డును ఎలా తయారు చేస్తరో తెలుసా ?


బాద౦ తింటే కంటి అద్దాలతో అవసరం లేదు

బాదo పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్నులాగే ఉంటుంది . ప్రజల కంటి చూపు కోసం దేవుడు దీన్ని సృష్టించాడు . 
బాద౦ పప్పులు 2 ౦ ౦ , గ్రాములు , తీసుకొని రాత్రి వేడి నీటిలో నానా బెట్టాలి . తెల్లవారినే తరువాత పై తోలు తిసి నలగొట్టి చూర్ణం చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి . అదే విధంగా 
సోపు గింజలు 2౦౦ గ్రాములు తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకొని దానికి కండ చెక్కర 2౦౦ గ్రాములు తీసుకొని ఈమూడింటిని కలుపుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి . 
పెద్దలకు రెండు స్పూన్ లు మోతాదుగా ఆవుపాలు వేడి చేసుకొని అందులో ఈ చూర్ణం కలుపుకొని సేవిస్తువుంటే నేత్ర దృష్టి పెరుగుతుంది . పిల్లలకయితే ఒక స్పూన్ చాలు .
 ఈ విధంగా ఒక సంవత్సరం వాడితే అద్దాలు వాడె అవసరం ఉండదు . అంతే గాక మెదడుకు జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది కృశించి పోయిన శరీర భాగాలను కూడా ఉత్తేజ భరితం చేస్తాయి . 


10, ఏప్రిల్ 2016, ఆదివారం

స్త్రీ ,పురుష శృంగారాన్ని శాసించే చంద్ర కళలు

శృంగార కలాధిపతి చంద్రుడు 
భూమిపై పుట్టిన ప్రతి జీవి ముఖ్యంగా మానవుల శృంగార జీవితం పై చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది . చంద్రునిలో పధహరు కళలు ఉన్నట్లుగానే స్త్రీ ,పురుషులలో కూడా పదహారు శృంగార కళ స్తానాలు ఉంటాయి . చంద్రుని కళల ప్రభావం ఆయా స్త్రీ ,పురుష జాతులను బట్టి ఆయా తిదులను బట్టి ఆయా దినాలలో ప్రేరెపింప బడుతుంటాయి . మానవులు ఎక్కడ నిద్రించిన చంద్ర కళల ప్రభావం నుండి తప్పించుకోలేరు . 

అందుకే మన ప్రాచినా సాహిత్యంలో స్త్రీ ,పురుషుల అనురాగ బందలను వివరించే సందర్బంలో ఎక్కువగా చంద్రును ప్రశంశ ఉంటుంది . కాబట్టి స్త్రీలు ,పురుష కళ స్తానాల గురించి , పురుషులు స్త్రీ కళ స్తానాల గురించి తెలుసుకొని వాటిని ఆచరణంలో పెట్టడడం ద్వారా అంతులేని ఆనందాన్ని పొందుతూ తమ దాంపత్య జీవితాన్ని సుఖమయం 
చేసుకోవచ్చు . 
కళా స్థానాలు అంటే ఏమిటి 
మనవ శరీరం ఒక మనోహరమైన వీణ లాంటిది .నైపుణ్యానమ్ గల విద్వా౦సుడు వీణను మీటినప్పుడు ఎన్నెన్నో స్వరాలూ పలికిన్చినట్లుగా శృంగార సరసులైన స్త్రీ ,పురుషులు మనవ శరీరంలో ఆయా ప్రదేశాలలో సున్నితముగా సుతరముగా తాకినపుడు ఆ శరీరము కూడా వీణ లాగే అంతులేని ఆనంద స్పందనలు  రగిలించి శృంగార రసాలను చిందింప చేస్తుంది . ఈ కళ స్థానాలు స్త్రీ పురుషులలో వేరు వేరు పక్షాలలో వేరు వేరు దిశలలో ప్రారంభమై చంద్ర కళల తో పాటే స్పందిస్తుoటయి. ఆ వివరాలు తెలుసుకుందాం . 


స్త్రీ ,పురుష షోడశ {16} కళ స్థానములు 
స్త్రీ ,పురుష శరీరాలలో ఎక్కడెక్కడ శృంగార కళ స్థానాలు ఉన్నాయో వాత్సయన  ముని వివరంగా తెలియజేసారు . 
{ 1} బొటన వేలు {2 } కాళీ మడిమ { ౩ } పిక్కలు  { 4 } తొడలు  { 5 } పిరుదులు  {6 } భగము / శిశ్నము {7 } నాభి  { 8 } భుజములు  {9 } చన్నులు {1 ౦ } చంకలు { 1 1 } చెవులు  { 1 2 } చెక్కిళ్ళు  { 1 ౩ } ముక్కు { 1 4 } గొంతు  [ 1 5 ] అధారములు  { 1 6 } తల  ఈ పదహారు స్థానాలను మన్మధ కళ స్తానములని పేర్కొంటూ ఈ స్థానములు స్త్రీ , పురుషులలో ఆయా తిదులను బట్టి ఎలా మారుతూ ఉంటాయో తెలియ చేసారు . 
స్త్రీ కళా స్థానములు - ఎడమనుండి కుడికి 

ప్రతి మాసంలో చంద్రుడు శుక్ల పక్షమిలో ఉన్నప్పుడు పాడ్యమి తిది నుండి స్త్రీ శరీరములో ఎడమ వైపు నుండి వరుసగా పైన  తెలిపిన అంగములలో ఒక్కొక్క అంగంలో శృంగార ప్రేరణ కలిగిస్తుంటాడు . అలాగే చంద్రుడు కృష్ణ పక్షమి లోకి రాగానే పదహారవ రోజునుండి కుడివైపు శరీర భాగములనుండి పై నుండి క్రిందకి వరుసగా ఆయా ప్రేరణలు కలుగుతు ఉంటాయి . ఆయా తిదులను బట్టి తన భార్య యొక్క మన్మధ కళ స్థానములను తెలుసుకొని భర్త ఆమెతో శృంగార ప్రయత్నం చేయాలి . ముందుగ ఆయా కళ స్థానాలలో ప్రేరణ కలిగిస్తూ వాంచలు తార స్థాయికి చేరిన తరువాత మైదునము ప్రారంబించి ఇరువురు సంపూర్ణ తృప్తి పొందాలని వాత్సాయన సూచించారు . 
పురుష కళ స్థానములు కుడి నుండి ఎడమకు 
చంద్రుడు కృష్ణ పక్షమిలో ఉన్నప్పుడు పాడ్యమి నుండి పురుషులలో కుడి వైపు వరుసగా పైన తెలిపిన ఆయ అంగములలో మన్మధ ప్రేరణ జరుగుతూ ఉంటుంది . అదే విధంగా చంద్రుడు శుక్ల పక్షమిలో ఉన్నప్పుడు పురుషులలో ఎడమ వైపున పై నుండి వరుసగా క్రిందకి ఆయా అవయములలో ప్రేరణలు కలుగుతు దిగుతూ ఉంటాయ్. ఈ మన్మధ కళలను గమనించి సక్రమంగా అవగాహనా చేసుకొని భార్య , తన భర్త యొక్క శరీరములో ఆయా ప్రదేశంలో ప్రేరణలు కలిగించి తన వంతు సహకరం అందిస్తూ తును తృప్తి పొంది తన భర్తను కూడా తృప్తి పొందేలా చేయాలనీ మహర్షుల ఆజ్ఞ . { వాత్సయన శాస్త్రం  నుండి } 


కంట్లో నీళ్ళు రాకుండా ఉల్లిపాయలను తరగడం ఎలా ?




8, ఏప్రిల్ 2016, శుక్రవారం

దీపరాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు

స్టీలు కుందుల్లోదీపారాధన చేయకూడదు . మట్టి లేదా ఇత్తడి ,వెండి కుందులు మాత్రమే వాడాలి . అగ్గి పుల్లతో దీపాన్ని వెలిగించ రాదు . అగరు బత్తితో వెలిగించాలి . దేవుని వద్ద ఒక వత్తితో దీపారాధన చేయరాదు . ఏక వత్తి శవం వద్ద మాత్రమే వెలిగిస్తారు . రెండు వత్తులు కలిపి ఒక వత్తి చేసి కుందిలో ఒకటి తూర్పు రెండవది ఉత్తరం ఉండాలి . కుంది అడుగున ఏదైనా చిన్న ప్లేటు పెట్టాలి . దీపారాదన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి . కుందిలను ఎప్పటికప్పుడే శుబ్రం చేయాలి . పాత వత్తులని వాడ కూడదు .విష్ణువుకు కుడి వైపున , శివునికి ఎడమ వైపున దీపం ఉండాలి . ఏ దేవత ,దేవి కైనా దీపం పక్కన మాత్రమే ఉండాలి .ఎదురు ఉండకూడదు .అలాగే చాల మంది కొబ్బరి కాయ కొట్టి వాటిని ఎదురు పెడతారు అలా పెట్ట కూడదు . వాటిని దేవుని వైపు ఉంచాలి . పోరా పాటున దీపం కొండ ఎక్కితే 1౦8 సార్లు ఓం నమ శివాయ అని దీపం వెలిగించాలి . ఈ రోజుల్లో వత్తులు అన్ని చేసినవి రెడి మెడ్  గా దొరుకుతున్నాయి . వీలైతే పగిడి పత్తి తో దీపారాధన చేస్తే మంచిది . కొబ్బరికాయ కొట్టిన తరువాత వాటికీ కొంత మంది కుంకుమతో మూడు బొట్లు పెడతారు అల పెట్ట కూడదు. కొబ్బరి కాయ కొట్టే ముందు దానికి ఉన్న పీచు అది మీ వైపుకు తిప్పుకొని కొట్టాలి . కాయను నీళ్ళతో  కడగా కూడదు . { ఈ పోస్ట్ ను ఎవరు కాఫీ చేయరాదు } 

6, ఏప్రిల్ 2016, బుధవారం

ప్రపంచంలో వింత చెట్టు ఆంద్ర ప్రదేశ్


ప్రభవ , విభవ అనే 60 స౦ || ఎలా ఉద్భవించాయి

నారాయణ నామ స్మరణ చేస్తూ నారదుడు ఒకసారి ద్వారకా నగరానికి వచ్చాడు . వచ్చిన మహర్షిని ఆహ్వానించి  సకల మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు అడిగాడు శ్రీ క్రిష్ణ . నారదుడు స్వామి తమరు లీల మానుష విగ్రుహులు కదా మీ మాయ ప్రభావంతో ఎందరో మాయలో పడిపోయారు మీ మాయకు లోబడనివారు ఎవరు లేరు కదా అన్నాడు .శ్రీ కృష్ణుడు నారద ! మాయ బలీయమైన శక్తి . త్రి ముర్తులం మేమే ఆ మాయను జయించలేము .ఇక ఇతరుల విషయము చెప్పనేల ? అన్నాడు నారదుడు అందరి సంగతి ఏమోకాని స్వామి ! ఆ మాయ జితేన్ద్రియుడను , త్రి లోక సంచారిణి , పరమ బాగా వత్త్హోత్ముడను అయిన నన్ను మాత్రం ఎం చేయలేదు అన్నాడు ధీమాగా . శ్రీ కృష్ణుడు నవ్వి వురుకన్నాడు . అల కాసేపు బయట తిరుగుతూ మాట్లాడుకుందాం రా ! అన్నాడు సరే పదండి అంటూ నారదుడు అనుసరించాడు . అల వారిద్దరూ కాళీ నడకన ఎంత దూరం నడిచారో వారికే తెలియదు  . నారదుడు స్వామి నాకు దాహం వేస్తుంది కాళ్ళు లాగుతున్నాయి ఒక్క అడుగు కుడా వేయలేను అంటూ అక్కడే కుఉలబడి పోయాడు . శ్రీ క్రిష్ణ అదిగో నారద దగ్గరగా కొలను కనిపిస్తోంది అక్కడకు వెళ్లి నీరు తాగుదాం కొంచం ఓపిక తెచ్చుకో అంటూ చేయి అందించాడు . కొంత దూరం పోగానే కలువ పూలతో ఎగురుతున్న పక్షులతో కిల కిల రావాలతో అందమైన సరోవరం కనిపించింది . నారదుడికి ప్రాణం లేచి వచ్చింది ఆ కొలనులో దిగి కడుపు నిండా నీరు తాగి నారాయణ అంటూ నీటిలో మునిగాడు . పైకి లేవగానే అందమైన స్త్రీగా మరి పోయాడు శ్రీ క్రిష్ణ కనుమరుగై పోయాడు . అల ఆ సరోవర ప్రాంతంలో తిరుగుతున్న ఆమెకు ఒకనాడు అందమైన యువకుడైన యోగి ధ్యాన ముద్రలో ఉండి కనిపించడు . ఆయనకు పరి చర్యలు చేస్తూ వుంది పోయింది . యోగి ధ్యాన౦ నుండి లేవగానే కనుల ముందు యువతీ కనిపించటం ఆమె తనకు పరి చర్యలు చేయటం యోగికి సంతోషాన్ని కలిగించాయి .ఆ అందం తన ముందు ఉండడం యోగిని , అందగాడు , యువకుడైన , యోగి మన్మధ రూపం ఆమెనుఆకర్షించాయి . అల వారిద్దరూ వివాహ బంధంతో కలసి కాపురం చేస్తున్నారు . కొంత  కాలానికి ఆ యోగి వలన ఆమెకు 60 సంతానం కలిగారు . ఒకరోజున యోగి సమాధిలో ఉండగా పిల్లలంత చెట్ల కింద ఆడు కుంటున్నారు . ఆమె పిల్లలకు భర్తకు ఆహారంగా పళ్ళు ఏరుక వద్దామని గంపతో అడవికి వెళ్ళింది . గాప నిండా మామిడి పళ్ళు ను తేచ్చి భర్తుకు . బిడ్డలకు తల ఒకటి ఇచ్చింది . అది తినగానే అందరు గిల గిల తన్నుకొని ప్రాణాలు వదిలేశారు . క్షణాల్లో హటత్హుగా జరిగిన సంగటన చూచి దుక్కిస్తూ తను ఆ పండ్లనే తిని చని పోవాలని అనుకుంది . చెట్టు వద్దకు పోయి పైన పండు కనిపిస్తుంది కానీ చేతికి అందదు . ఎత్తుకోసం భర్త , పిల్లల శవాలను పేర్చి వాటి పైకి ఎక్కి పండు కోయాలని ప్రయత్నం చేస్తోంది . అంతలో ఒక వృద్ద బ్రాహ్మణుడు ఆ చెట్టు వద్దకు చేరి ఆ వింత దృశ్యం చూచాడు . అమ్మాయి ఎవరు నీవు ? ఇదేమిటి శవాలను గుత్తగా పేర్చి నువ్వు చేస్తున్న పని ఏమిటి వింతగా ఉంది > ఎవరు అసలు నువ్వు అన్నాడు . అందుకు ఆమె అయ్యా ఈ చని పోయిన మనిషి నా భర్త , పిల్లలు . జరిగిది అంత చెప్పి ఈ చెట్టు పల్ల కోసం అందకుంటే ఈ పని చేస్తున్నాను అంది .అందుకు బ్రాహ్మణుడు అమ్మ ! చని పోయిన వారికీ అంత్య క్రియలు చేయకుండా ఆహరం తినడం తప్పు కదా ? పైగా ఆత్మ హత్య మహా దోషం కదా ? ముందు వీరికి అంత్య క్రియలు చయాలి దిగి రా !నేను నీకు తోడుగా ఉంటాను ఆ తరువాత జరగా వలసినది ఆలోచిద్దం . ముందు స్నానం చేయాలి అ సరోవరం వద్దకు రా ! అటు ఆమెను ఆ కొలను వద్దకు తిసుక వచ్చి మూడు స్నానం చేయి . కొలనులో దిగి చేయి పైకి ఎత్తిపట్టి నీటిలో మునుగు అన్నాడు . అల బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే చేయి పైకి ఎత్తి కొలనులో మునిగి పైకి లేవగానే ఆ స్త్రీ ఎప్పటిల నారదుడిగా మారిపోయాడు . ఆ బ్రాహ్మణుడు శ్రీ కృష్ణుడు గా మరి పోయాడు . స్వామి ఇదంతా నీ మాయో గద! నేను నీ మాయకు లోబడి పోయి స్త్రీ గా అయ్యాను .పిల్లలను కన్నాను ' అన్నాడు తలవంచి సిగ్గుతో చేతి గాజులు చూచుకుంటూ. కృష్ణుడు నారద మాయకు అందరం లో బడక తప్పదు ఎవరు తప్పించుకోలేరు . మరల నీటిలో మునుగు అన్నాడు . కృష్ణుని మాటలతో మరోసారి నీటిలో మునిగి లేచాడు . చేతి గాజులు పోయాయి . స్వామి స్త్రీగా ఉన్నప్పుడు నన్ను పెండ్లాడిన ఆయన ఎవరు ? ఆ బిడ్డలు ఎవరు ? అన్నాడు . శ్రీ క్రిష్ణ నారద ఆయన కల పురుషుడు , ఆ బిడ్డలు ప్రబావ వాది సంవత్సరాలు . కల పురుషునికి నకిలీ స్త్రీకి పుట్టిన బిడ్డలే ప్రబావ విబవ అనే పేర్లతో సంవత్సరాలుగా పిలువా బడుతు ఉంటారు అన్నాడు .కృష్ణను కీర్తిస్తూ హరి నామ స్మరణతో గగన మార్గాన వెళ్లి పోయాడు నారదుడు . అల లోకంలో కాలము - స౦  || రాలు మిగిలి పోయాయి { శుభం } { నా అనుమతి లేనిదే ఎవరు ఈ పోస్ట్ ను కాఫీ చేయరాదు }

5, ఏప్రిల్ 2016, మంగళవారం

ఆడపిల్ల లేదా మగపిల్లవాడు పుట్టాలంటే ?

సంతానాన్ని తమ ఛాయిస్ ప్రకారం పొందేదుకు ప్రపంచ వ్యాప్తంగా రక  రకాల పద్దతులు అమల్లో ఉన్నాయి . ఆయుర్వేద గ్రందాల్లో పుంసవన విధీ పేరుతో కొన్ని పక్రియలను సంహితకారులు వివరించారు . బహిష్టి అయిన మొదటి మూడు రోజులు వదలివేసి ౪, ౬, ౮, ౧౦, ౧౨, ౧౪ " సరి " రోజుల్లో భార్య భర్తలు కలిస్తే మగపిల్లవాడు . ౫ , ౭ , ౯, ౧౧ , ౧౩  ఇలా " బేసి " రోజుల్లో కలిస్తే ఆడపిల్ల కలుగుతుంది . అలాగే గర్బ దానం తరువాత పుష్యమి నక్షత్రం రోజున  భర్త , భార్య  ముక్కు రంద్రల్లో లేత మర్రి ఊడలతో చేసిన క్షీర కల్పాన్ని కుడి ముక్కులో వేస్తె మగ పిల్లవాడు  , ఎడం ముక్కులో వేస్తె ఆడపిల్ల పుడతారని సంహితకరులు సూచించారు . { ఆధారం  డా || చిరుమామిళ్ళ మురళి మనోహర్ . ఎం.డి  ఆయుర్వేద } 
Add caption

31, మార్చి 2016, గురువారం

జుట్టు సమస్యలకి చిన్న చిట్కా

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు సమస్యలు వస్తున్నాయి . రకరకాల షా౦పులు పెట్టిన ఫలితం ఉండదు . ఈ సమస్యలకి సింపుల్ చిట్కా మీ కోసం . అయిదు చెంచాల ఉసిరిక పొడి గాని లేక పది పదిహేను ఎండిన ఉసిరిక ముక్కలు గాని తగినన్ని నీటిలో వేసి రాత్రి నుంచి ఉదయం వరకు నానబెట్టాలి . ఉదయం మెత్తని పెస్టుగా నూరుకొని పైన తెలిపినట్లు తలకు పెట్టి ఒక గంట ఆగిన తరువాత తల కడగాలి . ఈ విదంగా వారానిక రెండు సార్లు చేస్తు వుంటే వెంట్రుకల బలహీనత , తలలో దురద , తెల్లని పొట్టు రాలటం వంటి సమస్యలు క్రమంగా తగ్గిపోయి అందమైన కేశ సంపద , దృడమైన జుట్టు మీ స్వంతం అవుతుంది . ( క్రిష్ణార్పణమ్ ) 

30, మార్చి 2016, బుధవారం

మజ్జిగను ఎలా తాగాలి ?

పూర్వం ప్రతి ఇంట్లో ఆవులు గేదెలు వుండేవి అప్పుడు పెరుగు బాగా వుండి కుడా మజ్జిగ ఎందుకు మాత్రమే వాడారు ? మరి ఇప్పుడు అందరు పెరుగు వాడుతున్నారు . ముఖ్యంగా పెరుగును రాత్రి తిన కూడదు . రాత్రి పెరుగు తింటే వాతం ఎక్కువగా ఉంటుంది . ఈ నాటి గృహిణులు అందరు తెలుసుకోవాలి . ఆయుర్వేదంలో మజ్జిగను పది రకాలుగా చెప్పారు అవి ఇప్పుడు చూద్దా౦.  మదితము అనే మజ్జిగ ; పేరు కొన్న పాలలో నీరు కలపకుండ చిలికి తయారు చేసిన మజ్జిగ . ఇది చిక్కగా జిడ్డుగా వుంటుంది ఈ మజ్జిగ ఆహారంలో వాడుతూ ఉంటె నిరసం ఉదర రోగాలు పైత్యం వల్ల కలిగిన వాతం నాలుకకు రుచి తెలియక పోవడం మూత్రము ఆగి పోవుట . నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి బలము కలుగు తుంది . ఈ రకమైన మజ్జిగ మన రెండు రాష్టాల ప్రజలు గ్రీష్మ ,శరత్ , హేమంత శిశిర రుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు . (2) మిలితమను మజ్జిగ ; పెరుగు ఒక వంతు నీళ్ళు మూడు వంతులు పోసి చిలికి తయరు చేసిన మజ్జిగ . ఇది శరీరంలో ని పైత్యం అరుచి ని అతిసార , విరేచానాన్ని రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను కుడా హరించి వేస్తంది . ( ౩) గోళము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీరు కలిపి తయారు చేసినది . ఈ విధమైన మజ్జిగ ను వాడుతూ వుంటే వీర్య వృద్ది , కలిగి శరీరానికి కాంతి వస్తుంది . కళ్ళకు మేలు చేస్తుంది . ఉదరములో మందగ్ని విష దోషములు , మేహము , ప్రమేహము , కఫ , రోగము ఆమ రోగము , అను వానిని పోగొడుతుంది . ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ , వర్ష , రుతువుల యందు సేవించ దగినది . ( 4) షాడభము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి చేసినది ఇది శ్లేష్మ రోగాలను గుల్మ రోగాలను రక్త మూల వ్యాదిని పోగొడుతుంది తేలికగా ఉండి ఉదరములో జటరాగ్నిని పెంచి శరీరానికి కాంతి వస్తుంది . (5) కాలేశేయము అను మజ్జిగ  ; ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయరు చేసినది ఈ మజ్జిగ బంక విరేచనాలు , విషములను ,  ఉబ్బులను , మంటను , వాతమును ముఉల వ్యాదిని , పోగొట్టి శరీరమును త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది . ఇప్పటికే పడిన ముడతలు కుడా తిసి వేస్తుంది . ( 6) కరమదితము అను మజ్జిగ ; పెరుగు నీళ్ళు సమంగా కలిపి చిలికి తయారు చేసినది . ఈ మజ్జి గ వగరుగా , పుల్లగా , రుచి కరముగా ఉంటుంది . ఈ మజ్జిగలో కొద్దిగా వేడి స్వబావం , మల బద్ధకం చేసే గుణం కుడా ఉంది . అయితే దీని వలన జట రాగ్నిబాగా పెరుగు తుంది . ప్రమేహము , చర్ది , ఉబ్బు , ముఉల రోగం ,భగందరమూ , కామెర్లు , కఫ వాతము , అరుచి , వీటిని పోగొట్టి వీర్య వృద్దిని బలాన్ని అందిస్తుంది . ఈ మజ్జిగ  ముఖ్యంగా వర్ష కాలలో సేవించడానికి అనుకూల మైనది . ( 7 ) ఉదాస్వితము అను మజ్జిగ ; పెరుగులో నాలుగవ వంతు నీళ్ళు పోసి చిలికి చేసినది . ఇది గుల్మములను , దెబ్బలను , అన్ని రకాల వాతములను , దారుణ వీరేచనాలను , తల తిప్పే రోగమును , మొదలైన సమస్త రోగాలను పోగొడుతుంది . దేహ పుష్టిని , ఇస్తుంది . ముఖ్యంగా ఈ మజ్జిగ గ్రీష్మ రుతువులో సేవింప దగినది . ( 8 ) తక్రమ అను మజ్జిగ ; పెరుగులో సగం వంతు నీళ్ళు కలిపి చిలికి తయారు చేసినది . ఇది తేలికగా ఉండి వేడిని అణచి వేస్తుంది . శరీరం తెల్లగా మారే పాండు  రోగము , ఉబ్బు , కఫ , వాతము , కడుపులో బల్లలు ,  భందరము  , ఉదార రోగాలు పోగొడుతుంది . దీనిని వసంత రుతువులో శొంటి , పిప్పలి , మిరియాలు , ఉసిరిక  పప్పు , ఈ నాలుగు ఒకొక్క గ్రాము వంతున కలిపి తాగాలి . ( 9 ) దండ హతము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు పోసి కవ్వముతో చిలికి తయారు చేసినది . ఇది రుచి కరముగా ,ఉంటుది . శరీరంలో అతి వేడి , అధిక కపము , ముత్రంలో పడే సుద్దా మొదలైన మేహములను మూలా వ్యాదిని పోగొడుతుంది . ఆహరం బాగా జీర్ణం చేస్తుంది . ఈ రకమైన మజ్జిగ ఎల్లప్పుడూ  తీసుకోవచ్చు . ( 1౦ )  అతి మీలితము అను మజ్జిగ ; ఒక వంతు పెరుగు తొమ్మిది వంతుల నీళ్ళు పోసి చిలికి చేసిన మజ్జిగ . ఇది ముఖ్యంగా ముఖానికి సంబందిచిన రోగములను గుల్మ్ మును , బల్ల , భాగందరము , ఉదర రోగము , అనే సమస్యలను పోగొడుతుంది . ***** మజ్జిగ గుణ దోష ప్రభావాలు ***** మజ్జిగ త్రి దోష సంహరి అనగా వాత , పిత్త , కపము , అనబడే మూడు దోషాలను సమ స్థితికి తీసుకొచ్చి సర్వ రోగములను పోగొడుతుంది . నాటు ఆవు పాల  నుండి కాని , నాటు గేదెల నుండి కాని పాలు తిసి పేరా పెట్టి చిలికి తయారు చేసిన మజ్జిగ భూలోక అమృతం . *** వాత రోగులు మజ్జిగ ఎలా వాడాలి  ? *** శరీరంలో ఇ ఒక్క భాగం లో నైన గాని , వాతము చేరి నందు వళ్ళ కలిగిన వాత వ్యాదులకు ఒక గ్లాసు పుల్లని మజ్జిగ లో ఒకటి లేదా రెండు గ్రాములు దోరగా వేయించిన శొంటి పొడి అదే మోతాదులో సైందవ లవణం కలిపి రెండు పూటల తాగుతూ ఉంటే వాత  వ్యాదులు అదుపులోకి వస్తాయి . **** పైత్య రోగులు మజ్జిగను ఎలా వాడాలి ? ***** శరీరంలో అరి కాళ్ళ మంటలు , అరి చేతులు మంటలు లేదా కళ్ళ మంటలు , తల , లేదా శరీరం అంత అమిత వేడితో కాలి పోతు ఉండడం చర్మ ము పై ఎర్రని పొక్కులు పుడ్లు రావడం నవ రంద్రాలలో ఎటు నుండి అయిన  రక్తం రావడం మొదలైన అనేక సమస్యలు ఉన్న వారు తియ్యని పలుచని ఒక గ్లాసు మజ్జిగ లో ఒక టే స్పూన్ కండ చక్కర పొడి కలిపి రెండు లేక మూడు పూటల తాగుతూ ఉంటే  పైత్య రోగం అదుపులోకి వస్తుంది . 

29, మార్చి 2016, మంగళవారం

మహాభారత యుద్దంలో ఎన్ని వ్యూహాలు ఉన్నాయో మీకు తెలుసా

క్రౌ౦చారుణ వ్యూహం ; ద్రుష్ట ద్యుమ్నుదు క్రౌ౦చ పక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు                                          మకర వ్యూహం ;  ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మిస్తాడు                                                                    గరుడు వ్యూహం ;మూడవ రోజున ఈ వ్యూహాన్ని భీష్ముడు నిర్మించాడు  దీనినే సువర్ణా వ్యూహం అంటారు             శకట వ్యూహం ;  పదకొండవ రోజున ఈ వ్యూహం ద్రోణా చార్యుడు  నిర్మించారు బండి ఆకారంలో సైన్యం నిలిపి కేంద్ర స్థానంలో ద్రోణా చార్యుడు ఉంటాడు .                                                                                                                  చక్ర వ్యూహం ; పద మూడవ   రోజున ఈ  వ్యూహం నిర్మించారు దీనినే పద్మా వ్యూహం అంటారు .ద్రోణా చార్యుడు ఈ వ్యూహంలో అభి మన్యున్ని భళి తీసుకున్నాడు .                                                                                               భార్హ స్పత్య వ్యూహం ; పది హేడవ రోజున   బృహస్పతి  సహకారంతో కర్ణుడు ఈ వ్యూహం పన్నాడు .                       శృంగాటక వ్యూహం ; ఎనిమిదవ రోజున నిర్మించిన ఈ వ్యూహంలోత్రికోనాకారంలో సైన్యం నిలుపుతారు ద్రుష్ట్యద్యుమ్నుడుభీష్ముని వ్యూహానికి ప్రతిగా నిర్మిస్తాడు .                                                                                  శ్యేన వ్యూహం ;ఈ వ్యూహం ఐదవ రోజు నిర్మిస్తాడు . దీనినే డేగ వ్యూహం అని కూడా అంటారు . భీష్ముడి మకర వ్యూహం నికి ప్రతిగా ద్రుష్ట్య ద్యుమ్నుడు నిర్మించాడు .                                                                                       అర్ద చంద్ర  వ్యూహం ; మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహం నికి ప్రతిగా దృష్ట్యా ద్యుమ్నుడుఈ వ్యూహం నిలుపుతాడు .                                                                                                                                             మండల వ్యూహం ; ఏడవ రోజున నిర్మించినఈ వ్యూహంలో భీష్మా చార్యుడు కురుసేనను మండలకారంలో నిలుపుతాడు .                                                                                                                                               మండలార్డ వ్యూహం ; ద్రోణుడు పన్నెడో రోజో కురు సేనను గరుడ వ్యూహంలో నిలుపగా ధర్మ రాజు పాండవ సైన్యం తో ఈ వ్యూహం రచిస్తాడు .                                                                                                                             వజ్ర వ్యూహం ; ఏడవ రోజున భీష్ముడు కురుసేనను మండల వ్యూహం తో నిలువరించగ ధర్మ రాజు పాండవ సేనలను వజ్ర వ్యూహం తో నడిపిస్తాడు .                                                                                                           సూచి ముఖ వ్యూహం ; ఆరవ రోజున దృష్ట్యా ద్యుమ్నుడు పాండవ సేనను మకర  వ్యూహం తో నిలుపగా దానికి ప్రతిగా భీష్ముడు క్రౌంచ వ్యూహం తో సైన్యాన్ని నడిపిస్తాడు . రెండు వ్యూహాలు భంగ పడడంతో అభి మన్యుడు సూచి ముఖ వ్యూహం పన్నుతాడు .                                                                                                                         వ్యాల వ్యూహం ; నాలుగవ రోజు భీష్ముడు కురు సేనను ముడి వేసు కున్న పాముల నిలుపుతాడు ఈ వ్యూహం ద్వారా సకల సైన్యాల కదలికలను అంచనా వేయటం కష్టము .                                                                             సర్వ తో భద్ర  వ్యూహం ; తొమ్మిదో రోజు కురు సేనతో ఈ వ్యూహం భీష్ముడు రచిస్తాడు .                                           మహా వ్యూహం ; రెండవ రోజు భీష్ముడు ఈ వ్యూహం అనేక విధాలుగా  నిర్మించి అందరిని హాడ్ల కొట్టాడు .                 ఎనిమిదవ రోజో కూడా ఈ వ్యూహం భీష్ముడు నిర్మించాడు .                                                                               తొమ్మిదో రోజు కూడా భీష్ముడు నిర్మించిన సర్వత్ భద్ర వ్యుహనికి ప్రతిగా ద్రుష్ట్య ద్యుమ్నుడు మహా వ్యూహం నిర్మిస్తాడు .