6, ఏప్రిల్ 2016, బుధవారం

ప్రభవ , విభవ అనే 60 స౦ || ఎలా ఉద్భవించాయి

నారాయణ నామ స్మరణ చేస్తూ నారదుడు ఒకసారి ద్వారకా నగరానికి వచ్చాడు . వచ్చిన మహర్షిని ఆహ్వానించి  సకల మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు అడిగాడు శ్రీ క్రిష్ణ . నారదుడు స్వామి తమరు లీల మానుష విగ్రుహులు కదా మీ మాయ ప్రభావంతో ఎందరో మాయలో పడిపోయారు మీ మాయకు లోబడనివారు ఎవరు లేరు కదా అన్నాడు .శ్రీ కృష్ణుడు నారద ! మాయ బలీయమైన శక్తి . త్రి ముర్తులం మేమే ఆ మాయను జయించలేము .ఇక ఇతరుల విషయము చెప్పనేల ? అన్నాడు నారదుడు అందరి సంగతి ఏమోకాని స్వామి ! ఆ మాయ జితేన్ద్రియుడను , త్రి లోక సంచారిణి , పరమ బాగా వత్త్హోత్ముడను అయిన నన్ను మాత్రం ఎం చేయలేదు అన్నాడు ధీమాగా . శ్రీ కృష్ణుడు నవ్వి వురుకన్నాడు . అల కాసేపు బయట తిరుగుతూ మాట్లాడుకుందాం రా ! అన్నాడు సరే పదండి అంటూ నారదుడు అనుసరించాడు . అల వారిద్దరూ కాళీ నడకన ఎంత దూరం నడిచారో వారికే తెలియదు  . నారదుడు స్వామి నాకు దాహం వేస్తుంది కాళ్ళు లాగుతున్నాయి ఒక్క అడుగు కుడా వేయలేను అంటూ అక్కడే కుఉలబడి పోయాడు . శ్రీ క్రిష్ణ అదిగో నారద దగ్గరగా కొలను కనిపిస్తోంది అక్కడకు వెళ్లి నీరు తాగుదాం కొంచం ఓపిక తెచ్చుకో అంటూ చేయి అందించాడు . కొంత దూరం పోగానే కలువ పూలతో ఎగురుతున్న పక్షులతో కిల కిల రావాలతో అందమైన సరోవరం కనిపించింది . నారదుడికి ప్రాణం లేచి వచ్చింది ఆ కొలనులో దిగి కడుపు నిండా నీరు తాగి నారాయణ అంటూ నీటిలో మునిగాడు . పైకి లేవగానే అందమైన స్త్రీగా మరి పోయాడు శ్రీ క్రిష్ణ కనుమరుగై పోయాడు . అల ఆ సరోవర ప్రాంతంలో తిరుగుతున్న ఆమెకు ఒకనాడు అందమైన యువకుడైన యోగి ధ్యాన ముద్రలో ఉండి కనిపించడు . ఆయనకు పరి చర్యలు చేస్తూ వుంది పోయింది . యోగి ధ్యాన౦ నుండి లేవగానే కనుల ముందు యువతీ కనిపించటం ఆమె తనకు పరి చర్యలు చేయటం యోగికి సంతోషాన్ని కలిగించాయి .ఆ అందం తన ముందు ఉండడం యోగిని , అందగాడు , యువకుడైన , యోగి మన్మధ రూపం ఆమెనుఆకర్షించాయి . అల వారిద్దరూ వివాహ బంధంతో కలసి కాపురం చేస్తున్నారు . కొంత  కాలానికి ఆ యోగి వలన ఆమెకు 60 సంతానం కలిగారు . ఒకరోజున యోగి సమాధిలో ఉండగా పిల్లలంత చెట్ల కింద ఆడు కుంటున్నారు . ఆమె పిల్లలకు భర్తకు ఆహారంగా పళ్ళు ఏరుక వద్దామని గంపతో అడవికి వెళ్ళింది . గాప నిండా మామిడి పళ్ళు ను తేచ్చి భర్తుకు . బిడ్డలకు తల ఒకటి ఇచ్చింది . అది తినగానే అందరు గిల గిల తన్నుకొని ప్రాణాలు వదిలేశారు . క్షణాల్లో హటత్హుగా జరిగిన సంగటన చూచి దుక్కిస్తూ తను ఆ పండ్లనే తిని చని పోవాలని అనుకుంది . చెట్టు వద్దకు పోయి పైన పండు కనిపిస్తుంది కానీ చేతికి అందదు . ఎత్తుకోసం భర్త , పిల్లల శవాలను పేర్చి వాటి పైకి ఎక్కి పండు కోయాలని ప్రయత్నం చేస్తోంది . అంతలో ఒక వృద్ద బ్రాహ్మణుడు ఆ చెట్టు వద్దకు చేరి ఆ వింత దృశ్యం చూచాడు . అమ్మాయి ఎవరు నీవు ? ఇదేమిటి శవాలను గుత్తగా పేర్చి నువ్వు చేస్తున్న పని ఏమిటి వింతగా ఉంది > ఎవరు అసలు నువ్వు అన్నాడు . అందుకు ఆమె అయ్యా ఈ చని పోయిన మనిషి నా భర్త , పిల్లలు . జరిగిది అంత చెప్పి ఈ చెట్టు పల్ల కోసం అందకుంటే ఈ పని చేస్తున్నాను అంది .అందుకు బ్రాహ్మణుడు అమ్మ ! చని పోయిన వారికీ అంత్య క్రియలు చేయకుండా ఆహరం తినడం తప్పు కదా ? పైగా ఆత్మ హత్య మహా దోషం కదా ? ముందు వీరికి అంత్య క్రియలు చయాలి దిగి రా !నేను నీకు తోడుగా ఉంటాను ఆ తరువాత జరగా వలసినది ఆలోచిద్దం . ముందు స్నానం చేయాలి అ సరోవరం వద్దకు రా ! అటు ఆమెను ఆ కొలను వద్దకు తిసుక వచ్చి మూడు స్నానం చేయి . కొలనులో దిగి చేయి పైకి ఎత్తిపట్టి నీటిలో మునుగు అన్నాడు . అల బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే చేయి పైకి ఎత్తి కొలనులో మునిగి పైకి లేవగానే ఆ స్త్రీ ఎప్పటిల నారదుడిగా మారిపోయాడు . ఆ బ్రాహ్మణుడు శ్రీ కృష్ణుడు గా మరి పోయాడు . స్వామి ఇదంతా నీ మాయో గద! నేను నీ మాయకు లోబడి పోయి స్త్రీ గా అయ్యాను .పిల్లలను కన్నాను ' అన్నాడు తలవంచి సిగ్గుతో చేతి గాజులు చూచుకుంటూ. కృష్ణుడు నారద మాయకు అందరం లో బడక తప్పదు ఎవరు తప్పించుకోలేరు . మరల నీటిలో మునుగు అన్నాడు . కృష్ణుని మాటలతో మరోసారి నీటిలో మునిగి లేచాడు . చేతి గాజులు పోయాయి . స్వామి స్త్రీగా ఉన్నప్పుడు నన్ను పెండ్లాడిన ఆయన ఎవరు ? ఆ బిడ్డలు ఎవరు ? అన్నాడు . శ్రీ క్రిష్ణ నారద ఆయన కల పురుషుడు , ఆ బిడ్డలు ప్రబావ వాది సంవత్సరాలు . కల పురుషునికి నకిలీ స్త్రీకి పుట్టిన బిడ్డలే ప్రబావ విబవ అనే పేర్లతో సంవత్సరాలుగా పిలువా బడుతు ఉంటారు అన్నాడు .కృష్ణను కీర్తిస్తూ హరి నామ స్మరణతో గగన మార్గాన వెళ్లి పోయాడు నారదుడు . అల లోకంలో కాలము - స౦  || రాలు మిగిలి పోయాయి { శుభం } { నా అనుమతి లేనిదే ఎవరు ఈ పోస్ట్ ను కాఫీ చేయరాదు }

1 కామెంట్‌: