8, ఏప్రిల్ 2016, శుక్రవారం

దీపరాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు

స్టీలు కుందుల్లోదీపారాధన చేయకూడదు . మట్టి లేదా ఇత్తడి ,వెండి కుందులు మాత్రమే వాడాలి . అగ్గి పుల్లతో దీపాన్ని వెలిగించ రాదు . అగరు బత్తితో వెలిగించాలి . దేవుని వద్ద ఒక వత్తితో దీపారాధన చేయరాదు . ఏక వత్తి శవం వద్ద మాత్రమే వెలిగిస్తారు . రెండు వత్తులు కలిపి ఒక వత్తి చేసి కుందిలో ఒకటి తూర్పు రెండవది ఉత్తరం ఉండాలి . కుంది అడుగున ఏదైనా చిన్న ప్లేటు పెట్టాలి . దీపారాదన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి . కుందిలను ఎప్పటికప్పుడే శుబ్రం చేయాలి . పాత వత్తులని వాడ కూడదు .విష్ణువుకు కుడి వైపున , శివునికి ఎడమ వైపున దీపం ఉండాలి . ఏ దేవత ,దేవి కైనా దీపం పక్కన మాత్రమే ఉండాలి .ఎదురు ఉండకూడదు .అలాగే చాల మంది కొబ్బరి కాయ కొట్టి వాటిని ఎదురు పెడతారు అలా పెట్ట కూడదు . వాటిని దేవుని వైపు ఉంచాలి . పోరా పాటున దీపం కొండ ఎక్కితే 1౦8 సార్లు ఓం నమ శివాయ అని దీపం వెలిగించాలి . ఈ రోజుల్లో వత్తులు అన్ని చేసినవి రెడి మెడ్  గా దొరుకుతున్నాయి . వీలైతే పగిడి పత్తి తో దీపారాధన చేస్తే మంచిది . కొబ్బరికాయ కొట్టిన తరువాత వాటికీ కొంత మంది కుంకుమతో మూడు బొట్లు పెడతారు అల పెట్ట కూడదు. కొబ్బరి కాయ కొట్టే ముందు దానికి ఉన్న పీచు అది మీ వైపుకు తిప్పుకొని కొట్టాలి . కాయను నీళ్ళతో  కడగా కూడదు . { ఈ పోస్ట్ ను ఎవరు కాఫీ చేయరాదు } 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి