23, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ వీర బ్రహ్మం గారి త్రికాల జ్ఞానము{ సాంద్ర సింధు వేదము }

శ్లో || ప్రభవ  పార్దివ మధ్యేషు 

బహు ప్రళయ నిశ్చయం 
అనంతరే , అనంత నిధ్యే 
రక్త పాతౌ రణరంగ భూమే 
భిభత్సా ప్రపంచ స్థితి ; 
ప్రభవ నామ సం|| నుండి పార్దివ నామ సం|| ర మధ్య కాలమున అనేక ప్రలయములు సంబవించుట జరుగును . అనంతరమున భుమండలమంతయు ఒక రణరంగాముగా మారి ఉహించని రక్త పాతంతో ప్రపంచము భయంకరముగా భీభత్స స్థితిలో కనిపించును . 
కలియుగము 5000 సం || ల పిమ్మట . జరిగే కాల జ్ఞాన విశేషములు 
భరత ఖండoభును పరదేశ వాసులు పాలన చేయుటకు వచ్చెను . వర్ణ సంకరంబు అధికమయ్యెను . అగ్ర వర్ణాలన్నీ కలుషితంబయ్యోను . గుళ్ళలో దేవతల మహిమలే నశియి౦చెనయ. మంత్రం తంత్రములలో శక్తి సన్నగిల్లెను విప్ర జాతుల వారికీ సైతము మద్య మాంసములపై  కోరికలు అధికం అయ్యోను . కనక గర్భం బైన భరత భూమిని పర దేశ వాసులు కొల్లగోట్టేదరు.ఉత్తర దేశమున వైశ్య కులమునందు గందోకడు జనియించెను .వాడు ఎకునే చేబట్టి ఎల్లా జనుల నేకంబుచేసి స్వరాజ్యం తెచ్చెను .రెండుక్షరాల పేరైన వాడు దేశాన్ని 1 8 సం|| లు పాలన చేసెను . ముడుపులు వెంకటేశ్వర స్వామికి ఇష్టమని ప్రజలు ఆ ముడుపులు తిరుపతికి జేర్చేదరు. కడప వద్దనున్న కమల పురంలో కప్పు కోడి వలే కూయును . జాతి జాతికి మధ్య వైరములు కలుగును . జనులు తల్లడిల్లెదరు . పెన్నా యోడ్డునున్న చెన్నూరు గ్రామము వరద పాలగును . ఈశాన్యమునుండి విష గాలి వచ్చి విపరీతముగా నరులు జత్తురు . కపట కిరాతకులను ఖండించుటకు కలికవతారుడు అవతరించును . ఉల్లిగడ్డకు ఉపదేశామిచ్చు కల్ల గురువులు కలికాలమందు వత్తురు . అట్టి గురువునేల్ల యముడు కాల దన్నును . కల్లలేనివారిని గాచును . కోయ రాజ్యం అంత గొడవల పాలగును . సైదా పేటలో సాహెబులందరూ సమరమున సచ్చేదరు . అద్దంకి సీమలో యాదవుని  ఇంట బుద్దునంతటి వాడు పుట్టును .తల్లి పిల్లలు తగువులాడు దినములు  వచ్చును . గద్దలను కాకి తన్నును . బ్రాహ్మణులకు పీటలు మాలలకు మంచాలు వేయుదురు . మధుర తంజావూరులు హరించును . మహానంది శిఖరము విరుగును . హంపి వీరుపాక్ష రెండు కన్నుల నడుమ అగ్ని వర్షం కురుయును . భూమి వణికి గ్రామంబులందును ముండ మోపులంత ముతైదులు అయ్యోరు . ముందు  ఏమి జరుగునో తెలియదందురు. చెడు నడలతేచే ప్రవర్తించు జనులు పండుటాకులు రాలినట్లు రాలుదురు . కుంభ కోణంలో గో వధ  ఎక్కువగా జరుగును . కొల్ల పురము కొల్లగోట్టేదరు .కంభం చెరువులో పొన్న పూయును ఆదోనీలో కప్ప కోడి కూచినట్టు అందరు వినుచుండగా కూయును . వావి వరసలు లేక జనులు చరించేదరు . { to be kun .....} 

4 కామెంట్‌లు: