20, ఏప్రిల్ 2016, బుధవారం

పసి పిల్లల వ్యాదుల్ని ఎలా తెలుసుకోవాలి

మాటలు రాని వయసులో ఉన్న పసి పిల్లలు తమ శరీరంలో ఏ భాగాన్ని తమ చేతితో అనేక సార్లు తాకుతూ ఉంటారో ఏ భాగం పైన పెద్దల చేయి తగిలితే సహించలేక ఏడుస్తూ ఉంటారో ఆ భాగంలో నొప్పి ఉన్నాదని పెద్దలు తెలుసుకోవాలి . 
పసి బిడ్డలా - ఛాతి నొప్పి లక్షణాలు ;- 
పిల్లలు ఎక్కువ సమయం కళ్ళు మూసుకొని ఉంటె ఆ పిల్లలకు శిరస్సులో నోప్పి  ఉన్నాదని గుర్తు . అలాగే పిల్లలు నాలుకను పెదవులను మాటిమాటికి నొక్కుతూ చేతులను ముడుచుకుంటే వారికీ రొమ్ములో అనగా చాతిలో నొప్పి ఉన్నాదని తెలుసుకోవాలి . 
పసి బిడ్డలా - కడుపునొప్పి లక్షణాలు ;- 
సుఖ  విరోచనం కాకుండా మల బంధం జరిగిన లేక వాంతి చేసుకుంటున్న లేక పాలు తాగేటప్పుడు తల్లి స్తనాలను కొరుకుతున్న లేక బిడ్డల ప్రేవులు అరుస్తూ ఉన్న ఈ లక్షణాలు శిశువులుకు కడుపులో నొప్పి ఉన్నాదని అర్ధం చేసుకోవాలి . 
పసిబిడ్డల ఆసనం - నొప్పి లక్షణాలు ;- 
మూత్రం సరిగా విడుదల కాక పోయిన లేక అకారణంగా ఉలికిపడుతూ ఉన్న అటు ఇటు దిక్కులు దిక్కులు చూస్తూ ఉన్న బిడ్డలకు గుదము నందు అనగా ఆసనం లో నొప్పి ఉన్నదని తెలుసుకొని తగిన చికిత్సలు చేయాలి . 
పిల్లలకు - పండ్లు వచ్చేటప్పుడు కలిగే వ్యాధులు ;- 
పసి బిడ్డలకు దంతాలు మొలిచే సమయం సర్వ రోగాలకు కారణమని ఆయుర్వేద శాస్త్ర వేత్తలు తెలియ చేసారు . ఆసమయంలో బిడ్డలకు జ్వరము మల బంధము , దగ్గు , వాంతి , తల నొప్పి , అనే వ్యాదులు ఎక్కువగా పుడుతుంటాయి . 
పిల్లల - పొత్తి కడుపు లక్షణాలు ;- 
బిడ్డలకు కడుపు ఉబ్బురంగా ఉండి మాటిమాటికి కడుపును పైకెత్తుతూ ఉంటె వారికీ పొత్తి కడుపులో నొప్పి ఉన్నదని గుర్తు పట్టాలి . 
అక్షిత 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి