26, ఏప్రిల్ 2016, మంగళవారం

నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా లేక ఎర్రగా ఎలా మార్చుకోగలం

అమ్మాయిలు , అబ్బాయిలు మీ ముఖం నల్లగా మారి పోతుందని మీకు బెంగగా ఉందా ? ప్రతి చిన్న సమస్యకు ఆందోళన పడకూడదు . ఇలా మనసులో మలినం లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ క్రింది వాటిల్లో ఎదో ఒకదానిని ఆచరించండి . 

బాదం పప్పుతో  బంగారు యోగం  

ఉదయం పూట నాలుగు బాదం పప్పులను అరా గ్లాసు మంచి నీటిలో వేసి నానా బెట్టండి .సాయంత్రం ఆ పప్పులపైన  ఉన్న తోలు తీసివేసి లోపలి పప్పును మెత్తగా నలగొట్టి అందులో తగినన్ని దేశవాళి గేద పాలు కలిపి మెత్తగా నూరితే గిజ్జు లాగ అవుతుంది . ఈ గుజ్జును రాత్రి నిద్రించే ముందు ముఖానికి లేపనం  చేసుకొని ఉదయం గోరు వెచ్చని నీటితో కడగండి . ఇలా పది , పదిహేను రోజులు చేసేటప్పటికి మీ ముఖంలో మార్పు కనిపిస్తుంది . 

శనగ పిండితో 

రెండు చెంచాల శనగ పిండి తీసుకొని అందులో తగినన్ని దేశవాళి గేద పాలు కలిపి మెత్తగా నూరి నల్ల బడ్డ ముఖానికి పట్టించాలి . అరగంట పాటు పౌర్ణమి నాటి చంద్రుడిని తలుచుకొని అతని తెల్లని కాంతి మన ముఖంలో కి వస్తున్నట్టు బలంగా భావన పెట్టుకోవాలి . తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి . ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటే అతి త్వరలో నలుపు హరించి ముఖ కాంతి పెరుగుతుంది . 

పాలతో .......

దేశవాళి గేద పాలు తీసుకొచ్చి , కాచి దించి అందులో కొద్దిగా ఉప్పు గాని , నాలుగైదు చుక్కల నిమ్మరసం గాని వేస్తె పాలు విరిగి పోతాయి . అలా విరిచిన పాలను వడపోసి నీరు తీసి చిన్న చిన్న తునకలుగా పగిలిన పాల ముక్కలలో సమంగా కస్తూరి పసుపు , బార్లి గింజల పిండి కలిపి మెత్తగా నూరి మఖనికి మెడకు ,గొంతుకు ఇంకా శరీరంపై నల్లని మచ్చలు వచ్చిన చోట అరంగుళం మందంగా లేపనం చేయాలి . అరగంటాగి గోరు వెచ్చని నీటితో కడగాలి . ఇలా ప్రతి రోజు చేస్తుంటే చెడు పదార్దాలు లతో గట్టి పడ్డ చర్మం మెత్తబడి క్రమంగా నలుపు చెరిగి పోయి మంచి కాంతి వస్తుంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి