29, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఇంటి ముందు కళ్ళాపి ఎందుకు చల్లాలి ?

పూర్వం మన దేశంలో గురుకులాల్లోని విద్యార్దులు భిక్షమెత్తి గురువుకి సమర్పిస్తూ విద్యాభ్యాసం చేసేవారు . గ్రామా పురోహితుడు , బౌద్ద బిక్షువులు కూడా " భవతి భిక్షం దేహి " అని గృహస్తులను అర్దించేవారు . " అతిధి దేవో భవ " అన్న సంస్కృతి మనది . బియ్యం , జొన్నలు , రాగులు , మొదలైన ఆహార, ధాన్యంతో పాటుగా కూరగాయలు కూడా ధర్మచారంగా దానం చేసేవారు . గృహస్తులు ఆవుపేడతో కళ్ళాపి చల్లి రంగ వల్లులు దిద్దిన యింటిముందు మాత్రమే ధర్మ భిక్షను అర్దించేవారు . ఏ ఇంటి ముందైన కళ్ళాపి లేకుంటే ఆ ఇంటిలో ఎదో " అశుభం " జరిగి ఉంటుందని అవగాహన చేసుకొని ముందుకి సాగిపోయో పద్ధతి ఉంది . కాల క్రమేనా ఇదొక ఆచారమయింది . ఆవు పేడను నీటిలో కలిపి కళ్ళాపి చల్లడం వల్ల రోగ  కారక క్రిమి ఇంటి లోనికి ప్రవేశించకుండా వుంటుంది . సూర్యోదయానికి ముందే కళ్ళాపి చల్లాలి . ఆ ఆచారము లక్ష్మి దేవికి ఆహ్వానము , సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కళ్ళాపి చల్ల కూడదు . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి