24, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ వీర బ్రహ్మం గారి త్రికాల జ్ఞానము { సాంద్ర సింధు వేదము }

 వసుధలో { భూమిలో } పంటలు ఎండును . కందినూరులో స్ర్తీ పురుశుడగును . ఉత్తరాదినుండి ప్రజలు వలస వత్తురు . యుద్దములు ఎక్కువగా జరుగును . ఉత్తర దేశమున ప్రజలు కత్తులతో పోరాడేదరు . నది నదములు ఉప్పొంగి ఊల్లన్ని కొట్టుకుపోవును . హంపిలో ఉన్న హనుమంత రాయుడు వీధుల వెంట కేకలు వేయును . అ కేకలకు మహా నంది మూలన ప్రజలు  ఆకులు రాలినట్లు రాలుదురు . మాల మాదిగలు భూపాలగుదురు. మేలు కీడగును . తార తమ్యము లేక ప్రజలు తిరిగుదురు . పదహారు చేతులు గల కామిని గండి కోట  మీద తిరుగును . ఆకాశమున భుగు పుట్టును . ఆవులు ఆకాశము వంక చూసి అరచును . కొత్త పేట సంత పురమునకు మాటలాడే కోతి వచ్చును . ఆ కోతి యత్తేపు రామన్న గట్టు మీద ఏడు దినములుండును . పల్లెలు పట్నాలు గృహ పీడా వలన పాడగును  . కామ క్రోధములు ఎక్కువగును . ధనము కొరకు కలహములు ఎక్కువగా జరుగును . నల్లని ఆవులు ఎక్కువ పాలిచ్చును . బిడ్డలు లేని గోడ్రండ్రా కడుపున బిడ్డలు పుట్టును . జనులకు కష్టములు కలుగ బోవు ముందు వడి గళ్ళ వాన కురియును . పగలు వేళా నక్కలు గ్రామములో అరచును . కుక్క  మూతికి తోక పుట్టును . మద్య పానము వలన జనులు కొట్టుకోనిదేరు . ప్రతి వారు విద్య యందు అపేక్ష కలిగి యుందురు . పాతాళ గంగ యింకును . మంటలు ఎక్కువగా మండును . పాతకులు నశింతురు. నీతి మంతులు నిలిచు యుందురు . వారిదు లింకును వసుధ పాడగును . నక్షత్రములు భూమిమీద రాలును . భరతుని శాపముచేతను శూద్రుల భాగ్య దేవత తొలగి పోవును . కొండవీడు కొల్లబవును . మధుర మీనాక్షమ్మ మాటలాడును . అనేక అద్భుతాలు పుట్టును . నెల్లూరు సీమంతయు నిర్మలమగును . నిడిగల్లు నిర్డుత మగును .ముండ మోపులంత కన్నేలగుదురు . మదముతో భూమినేలేదరు. ఎండా వెన్నెల రెండు సమముగా యుండును . యాగములు ఎక్కువగా చేయుదురు . నాగయ్య అనే 7 సం || ల బాలుడు నాలుగు వేదములు చదువును . బనగానే పల్లె గొప్ప పట్నామగును . భాగ్యముతో తుల తూగుచుండును . రూకకు పుట్టెడు ధాన్యము తరువాత పోకకు పుట్టెడు అమ్ముదురు .లోకములో అన్నము కలిగి ప్రజలు సుఖి౦చెదరు. రామేశ్వరము యెద్ద రణరంగమగును. రాజులు నశించెదరు. కామాక్షి తల్లి కరుణించి భక్తులగాచును . రాయ దుర్గామునకు రామ చిలుక వచ్చి రామధర్మ రాజు వార్తలు చెప్పును . పాయ కట్టు పశువుల యెద్ద  ఏడేండ్ల  పడతికి పిల్లలు పుట్టేదురు . మహా నంది సమీపమున మాల బోయలు ముష్టి యుద్దమున జచ్చేదరు . గోలు కొండలో కొంగ మాటలాడును . ముండ్ల పాటి యెద్ద మునులందరు చేరుదురు . గుండ్లన్నియు తేలును . బెండ్లన్నియు మునుగును . భూ భారము తగ్గును . గంగ , యమునలు ఉప్పొంగును . తుంగ భద్ర తీరమున ముగ్గురు మూర్తులు శృంగారముగా యోలదరు . మేలయిన కృతయుగము ధర్మమము నడుచును . ప్రపంచమంతయు మహా ప్రలయంబులతో నుండు కాలము లగ్నంబులను  బెట్టుకొని ప్రపంచముపైకి పరిగిడుచు వచ్చు చున్నది . కాలమాన పరిస్థితులు క్షణ క్షణంబు నకు మారు చుండును .  { TO BE KUN ....} 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి