5, ఏప్రిల్ 2016, మంగళవారం

ఆడపిల్ల లేదా మగపిల్లవాడు పుట్టాలంటే ?

సంతానాన్ని తమ ఛాయిస్ ప్రకారం పొందేదుకు ప్రపంచ వ్యాప్తంగా రక  రకాల పద్దతులు అమల్లో ఉన్నాయి . ఆయుర్వేద గ్రందాల్లో పుంసవన విధీ పేరుతో కొన్ని పక్రియలను సంహితకారులు వివరించారు . బహిష్టి అయిన మొదటి మూడు రోజులు వదలివేసి ౪, ౬, ౮, ౧౦, ౧౨, ౧౪ " సరి " రోజుల్లో భార్య భర్తలు కలిస్తే మగపిల్లవాడు . ౫ , ౭ , ౯, ౧౧ , ౧౩  ఇలా " బేసి " రోజుల్లో కలిస్తే ఆడపిల్ల కలుగుతుంది . అలాగే గర్బ దానం తరువాత పుష్యమి నక్షత్రం రోజున  భర్త , భార్య  ముక్కు రంద్రల్లో లేత మర్రి ఊడలతో చేసిన క్షీర కల్పాన్ని కుడి ముక్కులో వేస్తె మగ పిల్లవాడు  , ఎడం ముక్కులో వేస్తె ఆడపిల్ల పుడతారని సంహితకరులు సూచించారు . { ఆధారం  డా || చిరుమామిళ్ళ మురళి మనోహర్ . ఎం.డి  ఆయుర్వేద } 
Add caption

6 కామెంట్‌లు: